జిమ్నాస్ట్‌కు కియా కారు అందజేసిన మెగాస్టార్‌ - MicTv.in - Telugu News
mictv telugu

జిమ్నాస్ట్‌కు కియా కారు అందజేసిన మెగాస్టార్‌

December 22, 2021

15

తెలంగాణ జిమ్నాస్ట్ బుద్ధా అరుణారెడ్డి మెగస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఖరీదైన కారును బాహుమతిగా పొందారు. గతంలో మాజీ బీసీసీఐ జూనియర్‌ సెలక్షన్‌ కమిటీ చెర్మన్‌ చాముండేశ్వరనాథ్‌ అరుణ రెడ్డికి కారును బహుమతిగా ఇస్తానని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం తాజాగా హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా అరుణారెడ్డికి కియా సోనెట్ కారును బహూకరించారు. ఈ సందర్భంగా చిరంజీవి ఆమెను అభినందించి, రాబోయే రోజుల్లో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. 2018లో వరల్డ్ జిమ్నాస్టిక్స్ చాంపియన్ షిప్‌లో అరుణా రెడ్డి కాంస్యం సాధించి, అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే, అనూహ్యరీతిలో మోకాలి గాయం కారణంగా విరామం తీసుకుంది. రెండేళ్ల కిందట మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్న అరుణారెడ్డి.. ఇటీవలే మళ్లీ జిమ్నాస్టిక్స్ బరిలో దిగింది. ఈజిప్టులో జరిగిన పోటీల్లో రెండు స్వర్ణాలు సాధించి సత్తా చాటింది.