The heaviest rain in Death Valley for a thousand years
mictv telugu

డెత్‌వ్యాలీలో వెయ్యేళ్లకు కురిసిన భారీ వర్షం.. వరదల్లో వెయ్యి మంది

August 11, 2022

అది అమెరికాలోని డెత్ వ్యాలీ. పేరుకు తగ్గట్టే మృత్యు లోయ. ఎందుకంటే అక్కడికి వెళ్లిన వారు ఒక్కరు కూడా బతికి ప్రాణాలతో తిరిగి రాలేదు. అందుకని దానికా పేరు పెట్టారు. అక్కడ తాగడానికి గుక్కెడు మంచి నీరు ఉండదు. విశ్రాంతి తీసుకోవడానికి కనీసం ఒక చెట్టు కూడా మొలవదు. ఎటు చూసినా కొండలు, గుట్టలు కనిపిస్తాయి. ఎడారిలా కనిపించే ఈ లోయలో ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అలాంటి నిర్జీవ ప్రాంతంలో సుమారు వెయ్యేళ్ల తర్వాత ఈ సారి భారీ వర్షం కురిసింది. చినుకు పడడం కూడా కష్టమనుకుంటే రెండు వారాల వ్యవధిలో నాలుగు సార్లు కుండపోతగా వర్షం కురిసింది. దాంతో వరదలు పొంగి పోటెత్తాయి. వెయ్యేళ్ల తర్వాత కురిసినా భారీగా కురవడంతో టూరిస్టులుగా వెళ్లిన వెయ్యి మంది వరదల్లో చిక్కుకుపోయారు. వారికి చెందిన దాదాపు 30 కార్లు బురదలో కూరుకుపోయాయి. చివరికి ఆరు గంటల విపరీత శ్రమ తర్వాత వారంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో నెటిజన్లు ఆసక్తిగా తిలకిస్తున్నారు.