The heroine Vineeta has completely changed
mictv telugu

దొరికిపోయిన వెంకటేశ్ హీరోయిన్..

July 11, 2022

 

విక్టరీ వెంకటేష్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలో సౌందర్య ఒక హీరోయిన్ కాగా, నేపాలీ అమ్మాయిగా నటించిన హీరోయిన్ వినీత. తన సౌందర్యం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఆ సినిమా హిట్ అయినా వినీతకు అవకాశాలు రాలేదు. దాంతో తమిళంలో వెళ్లి ప్రయత్నించినా చిన్న చిన్న పాత్రలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తర్వాత ఆదాయం సరిపోక వ్యభిచారంలోకి దిగింది. తాను దిగడమే కాక, ఇతర యువతులను కూడా ఇందులోకి దింపి చివరికి పోలీసులకు పట్టుబడింది. అనంతరం కోర్టులో విచారణ సందర్భంగా మానసిక స్థితి బాలేదంటూ బెయిల్‌పై విడుదలైనా.. తర్వాత ఒంటరిగా ఉండిపోవాల్సి వచ్చింది. వ్యభిచారి అని బ్యాడ్ నేమ్ రావడంతో ఈమెను ఎవరూ పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాలేదు. పోనీ వ్యభిచారం చేసుకుందామన్నా ఆమె శరీరం చాలా మారిపోయింది. తాజాగా వినీత ఫోటోలను చూసిన వారు ఆమెను గుర్తుపట్టడం లేదు. మునుపటి ఆకారాన్ని కోల్పోయి సినీ అవకాశాలు లేక, ఇటు వ్యభిచారం చేయలేక ఒంటరిగా అలా బతుకీడుస్తోందని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. పరిశ్రమలో టాప్‌కి ఎదిగిన హీరోయిన్లే కాకుండా ఇలా పాతాళానికి దిగజారిన ఉదంతాలు కూడా ఉన్నాయంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు.