ఫ్లాష్ : ఉస్మానియాలో రాహుల్ పర్యటనకు అనుమతిచ్చిన హైకోర్టు - MicTv.in - Telugu News
mictv telugu

ఫ్లాష్ : ఉస్మానియాలో రాహుల్ పర్యటనకు అనుమతిచ్చిన హైకోర్టు

May 4, 2022

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించనున్నారు. ఈ మేరకు అనుమతి ఇవ్వాలంటూ యూనివర్సిటీ వీసీని హైకోర్టు బుధవారం ఆదేశించింది. కొన్ని రోజులుగా రాహుల్ గాంధీ పర్యటనకు వర్సిటీ గవర్నింగ్ కౌన్సిల్ అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. తర్వాత టీపీసీసీ వేసిన పిటిషన్ కూడా తిరస్కరణకు గురైంది.

అయినా పట్టు వదలని టీపీసీసీ బుధవారం కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. విచారించిన హైకోర్టు అనుమతి మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. కాగా, ఈ నెల 7న రాహుల్ గాంధీ హైదరాబాదు రానున్నారు.