The High Court annulled the decision taken by the AP Govt
mictv telugu

జగన్‌కు చుక్కెదురు.. ఆ నిర్ణయాన్ని రద్దు చేసిన హైకోర్టు

September 13, 2022

స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లోకి ద‌స్తావేజు లేఖ‌రుల ఎంట్రీకి ఏపీ హైకోర్టు మార్గం సుగ‌మం చేసింది. దస్తావేజు లేఖ‌రులకు ప్ర‌వేశాన్ని నిషేధిస్తూ ఇటీవ‌లే రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ దాఖ‌లైన పిటిష‌న్ పై న్యాయ‌స్థానం విచార‌ణ చేప‌ట్టింది.ద‌స్తావేజుల‌ను రాస్తూ త‌మ జీవ‌నోపాధి సాగిస్తున్నామ‌ని ద‌స్తావేజు లేఖ‌రుల‌కు పిటిష‌న్‌లో ధ‌ర్మాస‌నం ముందు వాపోయారు. ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో త‌మ జీవ‌నోపాధి ప్ర‌శ్నార్థ‌కంగా మారింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.ఈ క్రమంలో వాద‌న‌లు విన్న హైకోర్టు.. ప్ర‌భుత్వం జారీ చేసిన ఉత్త‌ర్వుల‌ను కొట్టివేసింది.

అంతకుముందు సచివాలయాల ద్వారా స్థిరాస్తికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిర్వహిస్తే రాష్ట్రవ్యాప్తంగా 50 వేల మంది దస్తావేజు లేఖరుల కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఏపీ దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వ రిజిస్ట్రేషన్ల బాధ్యతను సచివాలయాలకు అప్పగిస్తే లేని దస్తావేజులు ఉన్నట్లు , ఉన్నవి లేనట్లుగా జరగడానికి అవకాశం ఉంటుందన్నారు.