The High Court ordered the surrender of the accused of buying MLAs
mictv telugu

ఎమ్మెల్యేల కొనుగోళ్లు… నిందితుల రిమాండ్‌కు హైకోర్టు అనుమతి

October 29, 2022

The High Court ordered the surrender of the accused of buying MLAs

తెలంగాణలో రాజకీయంగా దుమారం రేపిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల వ్యవహారం కేసులో హైకోర్టు శుక్రవారం కీలక తీర్పునిచ్చింది. శుక్రవారం ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ.. ముగ్గురు నిందితులు సీపీ ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. అంతకు ముందు ఈ కేసులో వాదోపవాదాలు సుదీర్ఘంగా జరిగాయి.

పక్కా ఆధారాలతో ఈకేసును డీల్ చేస్తున్నామని పోలీసుల తరపు న్యాయవాది వాదించారు. అన్ని పరిశీలించిన హైకోర్టు సైబరాబాద్ పోలీసుల వాదనను సమర్ధించింది. నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. అంతేకాక ముగ్గురు నిందితులు హైదరాబాద్ నగరం విడిచి వెళ్లొద్దని షరతు విధించింది.