చిరంజీవిపై కేసు కొట్టివేత.. - MicTv.in - Telugu News
mictv telugu

చిరంజీవిపై కేసు కొట్టివేత..

March 14, 2019

2014లో సినీ నటుడు చిరంజీవిపై నమోదైన కేసును ఏపీ హైకోర్టు బుధవారం కొట్టివేసింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఆయనపై గుంటూరు, అరండల్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే నాలుగేళ్ల తర్వాత ఏపీ హైకోర్టు ఈ కేసును  కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ తేలప్రోలు రజనీ బుధవారం ఉత్తర్వులిచ్చారు.

The High Court that dismissed the case against Chiranjeevi.

2014 ఎన్నికల సందర్భంగా ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా రాత్రి 10 గంటల తరువాత కూడా ప్రచారం నిర్వహించారని చిరంజీవిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్‌ను కింది కోర్టు విచారణకు పూనుకుంది. కాగా, ఈ కేసును కొట్టేయాలని చిరంజీవి హైకోర్టుకు వెళ్ళారు. చిరంజీవిపై అక్రమంగా కేసు నమోదు చేశారని అతని తరఫు సీనియర్‌ న్యాయవాది పి.గంగయ్యనాయుడు పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రచారం పూర్తి చేసి తిరిగి వస్తున్నప్పుడు పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి, పోలీసులు చిరంజీవిపై నమోదు చేసిన కేసును కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో చిరంజీవికి ఊరట లభించినట్టైంది.