మహానటికి ఫిదా అయిపోయా.. జాన్వీ కపూర్ - MicTv.in - Telugu News
mictv telugu

మహానటికి ఫిదా అయిపోయా.. జాన్వీ కపూర్

March 14, 2019

మహానటి సినిమాలో కీర్తి సురేష్ నటనకు దక్షిణాది సినీ ప్రేక్షకులు ఫిదా అయిన సంగతి తెలిసిందే. అయితే కీర్తి సురేశ్‌ నటనకు తాను కూడా ఫిదా అయిపోయానంటోంది.. దివంగత అతిలోక సుందరి కుమార్తె.. బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్. కీర్తి సురేష్ తన తొలి హిందీ చిత్రానికి ఒకే చెప్పిన సంగతి తెలిసిందే. జాన్వి తండ్రి, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌ నిర్మించనున్న ఓ స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్ బయోపిక్‌లో కీర్తి.. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌కు జోడీగా నటించనున్నారు. అమిత్‌ శర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. ఈ విషయాన్ని చిత్రబృందం బుధవారం ప్రకటించింది. ఫుట్‌బాల్‌ క్రీడ నేపథ్యంలో కీర్తి నటించే సినిమా ఉండబోతోందని బాలీవుడ్‌ వర్గాల సమాచారం.

Jhanvi Kapoor can't stop obsessing over Keerthy Suresh's Bollywood debut with father Boney Kapoor

ఈ సందర్భంగా తనకు కీర్తి సురేశ్‌ అంటే చాలా ఇష్టమని జాన్వీ తప ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలుపుతూ కీర్తి ఫొటోను పోస్ట్‌ చేశారు. “కీర్తి.. ‘మహానటి’ సినిమాలో మిమ్మల్ని చూసినప్పటి నుంచి మీకు ఫిదా అయిపోయాను. మా నాన్న నిర్మిస్తున్న చిత్రంలో మీరు నటిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా, ఆత్రుతగా ఉంది. బాలీవుడ్‌కు స్వాగతం” అని క్యాప్షన్‌ పెట్టింది.