The Hijras harassed Thambi's family to pay off their debt in vijaywada
mictv telugu

డబ్బు కోసం ఇంటర్ బాలిక ప్రాణాలు తీసిన హిజ్రాలు

November 23, 2022

The Hijras harassed Thambi's family to pay off their debt in vijaywada

డబ్బు కోసం హిజ్రాలు ఓ బాలిక ప్రాణాలు తీసుకునేలా చేశారు. వారి తీరుతో మనస్థాపానికి గురైన బాలిక ఉరేసుకొని చనిపోయింది. విజయవాడలోని సత్యనారాయణ పురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. తంబి దాసు, పద్మ అనే దంపతులు ఇద్దరు కూతుళ్లతో కలిసి బావాజీ పేట డీమార్ట్ వెనుక నివాసం ఉంటున్నారు.

పెద్ద కుమార్తె ల్యాబ్ లో పని చేస్తుండగా, చిన్న కుమార్తె అనురాధ (18) ఓ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. ఇటీవల ఆ కుటుంబం అవసరాల నిమిత్తం తమకు తెలిసిన ఓ హిజ్రా వద్ద పదివేల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. ఆ అప్పును సకాలంలో తీర్చకపోవడంతో రెచ్చిపోయిన హిజ్రా.. సోమవారం రాత్రి మరికొంతమంది హిజ్రాలను వెంటేసుకుని తంబిదాసు ఇంటి ముందు హంగామా చేశారు. అసభ్య పదజాలంతో దూషించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన చిన్న కుమార్తె అనూరాధ.. మంగళవారం తెల్లారి తల్లిదండ్రులు పనులకు వెళ్లిన తర్వాత ఇంట్లో ఫ్యానుకు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మధ్యాహ్న సమయంలో బాలిక అమ్మమ్మ ఇంటికొచ్చి చూడగా, ఉరేసుకొని కనిపించడంతో పోలీసులకు సమాచారమిచ్చి ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే చనిపోయిందని డాక్టర్లు చెప్పడంతో పోలీసులు అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.