వీడు మాములోడు కాదు.. ముగ్గురు అక్కచెలెళ్లతో - MicTv.in - Telugu News
mictv telugu

వీడు మాములోడు కాదు.. ముగ్గురు అక్కచెలెళ్లతో

March 5, 2022

17

కాంగోలో ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఒక్కరు కాదు. ఇద్ధరు కాదు. ఏకంగా ముగ్గురు అక్కాచెలెళ్లు ఒకే అతనికి లవ్ ప్రపోజ్ చేశారు. అతనినే ముగ్గురు పెళ్లి కూడా చేసుకున్నారు. ఈ సంఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతుంది. మరి ఎవరు ఆ ముగ్గురు అక్కాచెలెళ్లు? ఎవరు ఆ పెళ్లికొడుకు? ఎందుకు ప్రపోజ్ చేశారు? ఎందుకు పెళ్లి చేసుకున్నారు? అనే పూర్తి వివరాలు తెలుసుకుందామా..

కాంగోకు చెందిన నడిగే, నటాషా, నటాలీ అనే అక్కాచెల్లళ్లు ముగ్గురూ అక్కాచెలెళ్లు. లువిజా అనే యువకుడిని ఇష్టపడ్డారు. అతడి వద్దకు వెళ్లి తమ ప్రేమ విషయాన్ని ఒకరి తర్వాత ఒకరు వ్యక్త పరిచారు. అది విని లువిజా ఒక్కసారిగా షాకయ్యాడు. వారి ప్రేమ విషయంపై సుదీర్ఘంగా ఆలోచించాడు. ఆ తర్వాత ముగ్గురి ప్రేమను అంగీకరించాడు.

అయితే కొద్ది రోజులుగా ప్రేమలో మునిగి తేలిన తర్వాత.. తమ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో అమ్మాయిల తల్లిదండ్రులు వారి పెళ్లికి ఓకే చెప్పారు. కానీ లువిజా తల్లిదండ్రులు మాత్రం దానికి అంగీకరించలేదు. దీంతో తల్లిదండ్రులు ఒప్పుకునే వరకూ పోరాడిన అతడు.. ఫలితం లేకపోవడంతో ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లను ఒకేరోజు నిమిషాల వ్యవధిలోనే పెళ్లి చేసుకున్నాడు.

ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ఆనందం వ్యక్తం చేశాడు. ”లోతుగా ఆలోంచించిన తర్వాత పెళ్లి నిర్ణయంపై ముందడుగు వేశా. ప్రేమకు పరిధి ఉండదు. ఈ నిర్ణయం తన తల్లిదండ్రులకు నచ్చలేదు. అందుకే పెళ్లికి వాళ్లు రాలేదు. అయితే ఒకటి కావాలనుకుంటే మరొకటి కోల్పోక తప్పదు” అని లూవిజా వ్యాఖ్యానించాడు.