ఆత్మహత్య అంటే ఈ మధ్య జనాలకు ఓ ఫ్యాషన్ అయిపోయింది. ప్రతీ చిన్నదానికి ఆత్మహత్య వరకు వెళ్లిపోతున్నారు. మినిమమ్ కామన్ సెన్స్ లేకుండా సిల్లీగా చనిపోతున్నారు. ఒక వయసు వారనే కాదు. చిన్న వయసు నుంచి పెద్ద వయసు వారి వరకు లింగ భేదం లేకుండా ఇలా తిక్క నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఓ భర్త తన భార్యకు చీర కట్టుకోవడం రాదని ఆత్మహత్య చేసుకున్నాడు.
వివరాలు.. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరంలో నివసించే 24 ఏళ్ల వ్యక్తి తన కంటే ఆరేళ్లు పెద్దదయిన మహిళను ఆరు నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. అయితే సదరు మహిళకు మాట్లాడడం, చీర కట్టుకోవడం, సరిగా నడవడం వంటివి రావు. దీంతో అసంతృప్తికి గురైన భర్త సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. నోట్లో తన భార్యకు చీర కట్టుకోవడం రాదని, అందుకే చనిపోతున్నానని రాసి మరీ పోయాడు. దీంతో ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.