The husband sought divorce because his wife became fat after marriage
mictv telugu

పెళ్లయ్యాక భార్య లావైపోయిందని విడాకులు కోరిన భర్త

September 1, 2022

The husband sought divorce because his wife became fat after marriage

సాధారణంగా పెళ్లి చేసుకోబోయే యువకులు కాబోయే భార్య సన్నగా, నాజూగ్గా అందంగా ఉండాలని కోరుకుంటారు. అప్పటివరకు అలా ఉంటే ఓకే కానీ, పెళ్లయ్యాక శరీరంలో మార్పులు వస్తే ఏంటి పరిస్థితి అని ఆలోచించరు. ఈ కోవకు చెందిన ఓ వ్యక్తి పెళ్లయ్యాక తన భార్య లావైపోయిందని భార్యను ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. అనంతరం విడాకుల కోసం కోర్టు మెట్లెక్కాడు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మీరట్‌లోని జకీర్ కాలనీకి చెందిన నజ్మాకు ఎనిమిదేళ్ల క్రితం ఫతేపూర్‌కు చెందిన సల్మాన్‌తో పెళ్లయింది. వీరికి ఏడేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. అయితే పెళ్లి, సంతానం తర్వాత నజ్మా బరువు పెరిగింది. దీంతో సల్మాన్ ఆమెను రోజూ వేధించేవాడు. నీలాంటి అధిక బరువు ఉన్న వ్యక్తితో ఎవరూ బతకరని మాటలతో హింసించేవాడు. అంతేకాక, ఇంట్లోంచి గెంటేసి కోర్టులో విడాకుల కేసు వేసి నజ్మాకు నోటీసులు పంపాడు. దీంతో న్యాయం చేయాలని నజ్మా పోలీసులను ఆశ్రయించగా, వారు పట్టించుకోకపోవడంతో మీడియాను ఆశ్రయించింది. ‘నేను బరువు పెరిగిన కారణంగా కాపురం చేయలేనని నా భర్త విడాకుల నోటీసు పంపాడు. కానీ, నేను విడాకులు ఇవ్వను. అతనితోనే కలిసి జీవించాలనుకుంటున్నాను’ అని వాపోయింది. దీనిపై పోలీసులను వివరణ కోరగా, తమకు సమాచారం అందితే చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పడం గమనార్హం.