The husband who chased the wife who was getting up with her boyfriend
mictv telugu

ప్రియుడితో లేచిపోతున్న భార్యను వెంటబడి పట్టుకున్న భర్త.. వీడియో వైరల్

September 17, 2022

The husband who chased the wife who was getting up with her boyfriend

సమాజంలో వివాహేతర సంబంధాలు ఎక్కువైపోతున్నాయి. పవిత్రమైన వివాహ బంధాలను చులకన చేస్తూ కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి. పరాయి వ్యక్తి మోజులో పడి కట్టుకున్న వారిని, కన్న పిల్లలను వదిలేయడం తరచూ చూస్తున్నాం. అంతేకాక అడ్డుపడే జీవిత భాగస్వాములను హతమార్చడం కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువయింది.

అయితే హత్య వరకు వెళ్లలేదు కానీ, ఇలాంటి ఘటనే ఒకటి ఉత్తర్ ప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగింది. పెళ్లై కూతురున్న ఓ భార్య ప్రియుడి మోజులో పడి అతని వెంట లేచిపోయింది. ఈ విషయాన్ని క్షణాల్లో గ్రహించిన భర్త వెంటనే స్పందించి ఆమె వెంటపడి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. వివరాల్లోకెళితే.. పదేళ్ల క్రితం మహిళకు ఓ వ్యక్తితో వివాహమయింది. తర్వాత కూతురు పుట్టగా, కొన్ని రోజులుగా సదరు మహిళ ఓ వ్యాపారితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసి భర్త మందలించినా మహిళలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సెప్టెంబర్ 11న భర్తతో గొడవపడ్డ మహిళ.. భర్తను, కూతురిని ఇంట్లో వదిలేసి ప్రియుడితో లేచిపోయింది. అనుమానంతో వెంటనే రియాక్ట్ అయిన భర్త తన కూతురిని తీసుకొని బైకు మీద భార్యను వెతకడానికి బయల్దేరాడు. కొద్దిసేపటికి ప్రియుడితో ఓ స్కూటీపై కైలాష్ మందిర్ రోడ్డుపై వెళ్తున్న భార్య కనపడడంతో బండి ఆపమని కేకలు వేశాడు. భార్య తనను ఎవరూ గుర్తు పట్టకుండా ముఖాన్ని కప్పుకొని కళ్లకు సన్ గ్లాసెస్ పెట్టుకుంది. ఇంతలో ఆమె ప్రియుడు వీరిని గుర్తించి వేగంగా వెళ్లే ప్రయత్నం చేయగా, భర్త అంతకంటే వేగంగా ప్రయాణించి వారిని పట్టుకున్నాడు. బండి దిగగానే వారిద్దరిని చెప్పుతో కొట్టి చితకబాదాడు. తర్వాత ఏమైందో తెలియదు కానీ, వీడియోలో అంతవరకే ఉంది.