నూతన దంపతుల మధ్య జరిగే చిలిపి సంఘటనలు చాలా సరదాగా ఉంటాయి. చాలా మందికి ఆ టైంలో జరిగే ఫన్నీ సీన్స్ జీవితంలో బాగా గుర్తుండి పోతాయి. ఇలాంటి సంఘటనే ఓ పెళ్లిలో జరిగింది. పెళ్లి వేడుకలో భాగంగా పీటలపై ఇద్దరు వధూవరులు కూర్చున్నారు. ఈ క్రమంలో పెళ్లితంతులో చివరి కార్యక్రమంగా వరుడు వధువు నుదిటిపై బొట్టు పెట్టాల్సిన కార్యక్రమం జరుగుతోంది.
పక్కన ఉన్న అమ్మలక్కలు వధువు పాపిడ తీయగా, వరుడు వధువు నుదుటి మీద సింధూరం బొట్టు పెట్టి, అదే ఊపులో బుగ్గపై ముద్దు పెట్టేశాడు. దీంతో భార్య (బొట్టు పెట్టేశాడు కాబట్టి భార్య అయినట్టే) సిగ్గుపడి తల దించుకుంది. పక్కన ఉన్న వాళ్లు ముసి ముసి నవ్వుకున్నారు. అయితే ట్విస్టేంటంటే.. తాను చేసిన పనికి ఆ నూతన భర్త అందరి ముందు కొత్త భార్యకు సారీ చెప్పడం. ఇదంతా ఫోటోలు, వీడియోలు తీస్తున్న కెమెరాల్లో రికార్డయింది. ఇప్పుడు ఆ వీడియో ఇన్స్టాగ్రాంలో తెగ వైరల్ అవుతోంది. పెళ్లిళ్ల సీజన్ కాకపోయినా ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అందుకు దీనికి వచ్చిన వ్యూస్, లైకులే నిదర్శనం. 11.6 మిలియన్ వ్యూస్, 927 k లైకులు వచ్చాయి.