నిత్య అన్నదాత అజర్ మఖ్సూసి...! - MicTv.in - Telugu News
mictv telugu

నిత్య అన్నదాత అజర్ మఖ్సూసి…!

October 16, 2017

 

హైద్రాబాద్  చంచల్‌గూడకు చెందిన  అజర్ మఖ్సూసి, రోజుకు 1000 మంది ఆకలి తీరుస్తూ మానవత్వాన్ని చాటుతున్నాడు. ఆకలి విలువ ఏంటో స్వయంగా అనుభవించాడు కాబట్టి, తన లాగ ఆకలితో ఇంకెవరి పేగులు మాడద్దని అనుకున్నాడు. ఆరు సంవత్సరాలుగా డబీల్‌పుర చౌరస్తాలో నిత్య అన్నదానం చేస్తూ  పేద వాళ్లకు ఆత్మబంధువయ్యాడు.  ఈయన సేవల గురించి తెలుసుకున్న అమితాబచ్చన్, అజర్ మఖ్సూసిని కలిసి అభినందించారు. ఒక్కోసారి ఆకలి తీర్చడానికి పైసలు లేకపోతే , తన దగ్గరున్న సామానును తాకట్టు పెట్టి మరీ పేదల ఆకలి తీర్చేవాడు. ఆతర్వాత ఈయన సేవను తెలుసుకొన్న కొందరు మానవత్వం ఉన్నోళ్లు,  నెల, నెల ఆయనకు విరాళాలు ఇస్తూ, అన్నదానంలో భాగం పంచుకుంటున్నారు. నేను, నాకుటుంబం,నాది, నా నా నా, అని నా దగ్గరే ఆగిపోయిన ఈసమాజంలో, సామాజిక బాద్యతతో తనవంతుగా ఓ గొప్పకార్యచరణకు శ్రీకారం చుట్టిన అజర్ మఖ్సూసిని మీకు పరిచయం చేస్తుంది మీ మైక్ టీవి.

 

మనిషి ఎంత కష్టపడినా జానెడు పొట్టకోసం అని అంటారు. కొందరు అభాగ్యులకు