గత 30 ఏళ్లలో టెక్నాలజీ విపరీతంగా అభివృద్ధి చెందింది.అంతకుముందు టెక్నాలజీ చాలా వెనకబడి ఉందని చెప్పవచ్చు.అలానే ఫోన్స్, టీవీలు ఇంకా ఇతర అన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇప్పుడున్న బేసిక్ ఫీచర్లను కూడా కలిగి లేవు. అయితే తాజాగా 1956కి చెందిన ఒక రిఫ్రిజిరేటర్ కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.ఈ బ్లాక్ అండ్ వైట్ వీడియోలో ఒక యువతి 66 ఏళ్ల క్రితం నాటి ఫ్రిజ్ లోని ఫీచర్లను వివరించింది.ఈ ఫీచర్ల గురించి తెలుసుకొని ఇప్పటితరం నెటిజన్లు షాక్ అవుతున్నారు.
Why’s this 66 year old fridge better than the one I got now pic.twitter.com/oFfu1CFfvI
— Lost in history (@lostinhist0ry) July 22, 2022
కొత్త తరహా రిఫ్రిజిరేటర్లతో పోలిస్తే అదే వెయ్యి రెట్లు బెటర్ అంటున్నారు. ఆ కాలంలోనే అత్యంత సౌకర్యవంతంగా రిఫ్రిజిరేటర్ ను రూపొందించడాన్ని చూసి ఔరా అంటూ మెచ్చుకుంటున్నారు. నాడు ఫ్రిగిడైర్ రిఫ్రిజిరేటర్ ప్రకటన వీడియోను ‘లాస్ట్ ఇన్ హిస్టరీ’ పేరుతో ఉన్న ట్విట్టర్ పేజీలో షేర్ చేశారు. ఇది ఎంతో మందిని ఆకర్షిస్తోంది. తమకు కూడా ఇలాంటి రిఫ్రిజిరేటర్ కావాలని యూజర్లు కామెంట్లు పెడుతుండడం గమనార్హం. ఈ 66 ఏళ్ల క్రితం నాటి ఫ్రిడ్జ్ ఇప్పుడు నాకున్న దానికంటే ఎందుకు గొప్పది అని లాస్ట్ ఇన్ హిస్టరీ పేజీ నిర్వాహకుడు పోస్ట్ పెట్టడం గమనార్హం. ఈ ఫ్రిడ్జ్ లో కంపార్ట్ మెంట్లు ఎంతో యూజర్ ఫ్రెండ్లీగా ఉన్నాయి. బయటకు పుల్ చేసి కావాల్సింది తీసుకోవచ్చు. డోర్ కు లోపలి వైపు పండ్లను తాజాగా ఉంచే కంపార్ట్ మెంట్ అదనపు ఆకర్షణ. అడుగు భాగాన డీప్ ఫ్రీజర్ ఏర్పాటు చేశారు.