సీఎం ఇంట్లోకి ప్రవేశించిన ఆగంతకుడు..అయోమయంలో అధికారులు - MicTv.in - Telugu News
mictv telugu

సీఎం ఇంట్లోకి ప్రవేశించిన ఆగంతకుడు..అయోమయంలో అధికారులు

July 5, 2022

పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ నివాసంలోకి అర్ధరాత్రి ఓ ఆగంతకుడు ప్రవేశించిన ఘటన కలకలం రేపింది. నివాసంలోకి ప్రవేశించిన ఆ అగంతకుడిని ఉదయం పోలీసులు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. అనంతరం అతని అదుపులోకి తీసుకొని, ఎందుకు సీఎం నివాసంలోకి ప్రవేశించావు? అని అడిగిదే, ఆ వ్యక్తి చెప్పిన సమాధానాలకు అధికారులు అయోమాయంలో పడ్డారు.

వివరాల్లోకి వెళ్తే.. అర్థరాత్రి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నివాసంలోకి ఓ గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించాడు. రాత్రాంత ప్రాంగణంలోనే ఉన్నాడు. ఉదయం 8 గంటల సమయంలో డ్యూటీలో ఉన్న పోలీసులు ఆ వ్యక్తి సీఎం నివాసంలో ఉండటం చూసి షాక్ అయ్యారు. ఎవరు నువ్వు? ఎందుకు సీఎం ఇంట్లోకి ప్రవేశించావు? అని అడిగితే.. ‘కోల్‌కతా లాల్‌బజార్‌లోని పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ అనుకొని, నేను సీఎం నివాసంలోకి ప్రవేశించాను” అని అన్నాడు. అనంతరం అర్ధరాత్రి టైంలో పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ఏం పని? అని అడుగగా..సమాధానం చెప్పలేక తడబడ్డాడు. దీంతో పోలీసులు తలలు పట్టుకున్నారు.

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మాట్లాడుతూ..”అర్ధరాత్రి సీఎం నివాసంలోకి చొరబడ్డ వ్యక్తి పేరు హఫీజుల్‌ మొల్లా. వయసు 30 ఏళ్లకుపైగా ఉంటుంది. అతడు ఉత్తర 24 పరగణాలు జిల్లా హష్నాబాద్‌కు చెందినవాడు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1:20 గంటల సమయంలో కాళీఘాట్ ప్రాంతంలోని హరీష్‌ ఛటర్జీ వీధి 34బీలో గోడ దూకి మమతా బెనర్జీ నివాసంలోకి ప్రవేశించాడు. పటిష్ఠ భద్రత ఉన్నా.. ఎవరికంటా పడకుండా లోనికి వెళ్లాడు. అతడిని చూస్తుంటే మానసిక స్థితి సరిగ్గాలేని వ్యక్తిలా కన్పిస్తున్నాడు. సీఎం నివాసంలోకి ప్రవేశించడానికి ముందు ఆదివారం అతడు ఎక్కడెక్కడ తిరిగాడో తెలుసుకుంటున్నాం. అతడు చెప్పిన వివరాల ప్రకారం మ్యాప్ రూపొందిస్తున్నాం” అని ఆయన అన్నారు.