కరోనా బాధితులకు ఫ్రీగా 2వేల ఐఫోన్లు పంపిణీ చేసిన ప్రభుత్వం - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా బాధితులకు ఫ్రీగా 2వేల ఐఫోన్లు పంపిణీ చేసిన ప్రభుత్వం

February 17, 2020

Japan Govt.

కరోనా బాధితులకు జపాన్ ప్రభుత్వం ఉచితంగా రెండు వేల ఐఫోన్లను పంపిణీ చేసింది. వారు ఉన్న విహార నౌక డైమండ్ ప్రిన్సెస్‌లోని ప్రయాణికులు, సిబ్బందికి జపాన్ ప్రభుత్వం ఈ ఆఫర్ చేసింది. వైద్యులు ప్రయాణికులతో సంప్రదింపులు జరిపేందుకు, వైద్యుల అపాయింట్‌మెంట్ తీసుకునేందుకు, సైకాలజిస్టులతో తమ సమస్యలను ప్రయాణికులు  చర్చించేందుకు ఈ ఫోన్లు వినియోగించనున్నట్టు సమాచారం. ఈ ఫోన్లలో ప్రభుత్వం ఓ ప్రత్యేకమైన యాప్‌ను ఇన్‌స్టాల్ చేసింది. దీంతో ప్రయాణికులకు కావాల్సిన సహాయాన్ని సులువుగా అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. నౌకలోని ప్రతి క్యాబిన్‌లోను కనీసం ఒక్క ఐఫోన్ అయినా ఉండేలా జపాన్ అధికారులు చర్యలు తీసుకున్నారు. 

ప్రయాణికుల వద్ద ఇప్పటికే ఫోన్లు ఉన్నప్పటికీ అందులో కొన్ని విదేశాల్లో రిజిస్టర్ అయి ఉన్నాయి. దీంతో వాటిలోకి ప్రభుత్వం తయారు చేసిన యాప్ డౌన్‌లోడ్ చేయడం కుదరదు. అందుకే ప్రభుత్వం ఇలా ఫోన్లనే ఉచితంగా పంపిణీ చేసిందని తెలుస్తోంది. వారి వద్ద ఉన్న ఫోన్లలో సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రయాణికులకు చేరవేయడం కష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో వారికి జపాన్‌లో రిజిస్టర్ అయిన ఐఫోన్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి ద్వారా ఎప్పటికప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను నౌకలోని ప్రయాణికులకు చేరవేయాలని ప్రభుత్వం భావిస్తోంది.