The Jharkhand Assembly passed a resolution increasing reservation by 77 percent
mictv telugu

ఆ రాష్ట్రంలో 77 శాతం రిజర్వేషన్లకు అసెంబ్లీ ఆమోదం

November 11, 2022

రిజర్వేషన్లపై దేశవ్యాప్త చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. పలు రాష్ట్ర ప్రభుత్వాలు తాము ఇచ్చిన ఎన్నికల హామీల మేరకు ఆయా వర్గాలకు రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీలో ఆమోదం తెలుపుతున్నాయి. అంతేకాక, రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్‌‌లో సవరణ చేయాలని కేంద్రాన్ని కోరుతున్నాయి.

తెలంగాణ, కర్ణాటక, బీహార్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. తాజాగా మరో రాష్ట్రం రిజర్వేషన్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గిరిజనులు ఎక్కువగా ఉండే ఝార్ఖండ్‌లో రిజర్వేషన్లను 77 శాతం పెంచుతూ శుక్రవారం అసెంబ్లీ తీర్మానం చేసింది. 2001 నాటి రిజర్వేషన్ చట్టాన్ని సవరిస్తూ ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ఓబీసీలకు విద్యా, ఉద్యోగాల్లో 17 శాతం పెంచారు. ఇంతకు ముందు ఎస్టీలకు 26 శాతం, ఎస్సీలకు 10, ఓబీసీలకు 14 శాతం ఉంది. తాజా తీర్మానంతో ఎస్టీలకు 28 శాతం, ఎస్సీలకు 12, ఈబీసీలకు 15, ఓబీసీలకు 12 శాతం రిజర్వేషన్ ఉండనుంది. ఇదే సమయంలో ప్రజల నివాస స్థితిని నిర్ణయించేందుకు 1932 నాటి భూ రికార్డులను ఉపయోగించాలని ప్రతిపాదించిన బిల్లును కూడా ఆమోదించింది.