The Juvenile Justice Board has issued a key verdict on the Jubilee Hills incident
mictv telugu

జూబ్లీహిల్స్ గ్యాంగ్‌రేప్.. మైనర్లపై సంచలన తీర్పిచ్చిన జువైనల్ బోర్డ్

September 30, 2022

The Juvenile Justice Board has issued a key verdict on the Jubilee Hills incident

హైద్రాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన అమ్నీషియా పబ్ గ్యాంగ్ రేస్ కేసులో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. రొమేనియాకు చెందిన మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఆరుగురు నిందితుల్లో ఐదుగురు మైనర్లన్న విషయం తెలిసిందే.

ఇప్పుడు మిగిలిన ఐదుగురు మైనర్లలో నలుగురు మేజర్లని, ఒక్కరు మాత్రమే మైనర్ అని జువైనల్ జస్టిస్ బోర్డు సంచలన నిర్ణయాన్ని వెలువరించింది. ఒక్క బహదూర్ పురా ఎమ్మెల్యే కుమారుడు మాత్రమే మైనర్ అని తేల్చి చెప్పింది. మిగతా ఐదుగురిని మేజర్లుగా పరిగణించి కోర్టులో విచారణ మొదలు పెట్టాలని పోలీసులను ఆదేశించింది. ఎమ్మెల్యే కుమారుడిని జువైనల్‌గా పరిగణించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. కాగా, అత్యాచారం ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. మైనర్ పేరిట నిందితులను వదిలేస్తారా? అని జనాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనిపై మంత్రి కేటీఆర్ కూడా నిబంధనల పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు స్పందించి అత్యాచారానికి పాల్పడ్డ వారు మైనర్లు ఎలా అవుతారు? మైనర్లయినంత మాత్రాన అత్యాచారం చేస్తే శిక్షించలేమా? అని జువైనల్ జస్టిస్ బోర్డులో పిటిషన్ దాఖలు చేశారు. బాలిక పట్ల నిందితులు వ్యవహరించిన తీరును బోర్డు ముందు వివరించారు. దీంతో విచారించిన బోర్డు.. పోలీసులకు అనుకూలంగా తీర్పునిచ్చింది.