యూఏఈలో భారత సినిమాకు అనుమతి.. విరుచుకుపడుతున్న దర్శకుడు - MicTv.in - Telugu News
mictv telugu

యూఏఈలో భారత సినిమాకు అనుమతి.. విరుచుకుపడుతున్న దర్శకుడు

March 31, 2022

kas

ద కశ్మీర్ ఫైల్స్ చిత్రం అరబ్ దేశమైన యూఏఈలో ప్రదర్శనకు ఆ దేశ సెన్సార్ బోర్డు అనుమతినిచ్చింది. ఇస్లామోఫోబియా గురించి వివాదాస్పద అంశాలున్నాయంటూ, సినిమాను నిషేధించాలని పలువురు ఆ దేశ సెన్సార్ బోర్డుకు లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో నాలుగు వారాల స్క్రూనిటీ అనంతరం అలాంటి అంశాలేవీ లేవని తేల్చి ప్రదర్శనకు అనుమతించింది. అంతేకాక, ఎలాంటి కట్స్ కూడా చెప్పకపోవడం గమనార్హం. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు. ‘ ఇస్లామిక్ అరబ్ దేశం సినిమాకు అనుమతించింది. ఇది పెద్ద విజయం. ఎటువంటి కట్స్ లేకండా 15 ప్లస్ రేటింగ్ ఇచ్చారు. ఏప్రిల్ 7న సినిమాను విడుదల చేస్తున్నాం. ఇలాగే సింగపూర్‌లో కూడా జరిగింది. ముస్లిం సంఘాల నుంచి సినిమాకు వ్యతిరేకంగా ఎన్నో వినతులు వచ్చాయి. మూడు వారాల పరిశీలన అనంతరం సినిమాలో అలాంటి సన్నివేశాలు లేవంటూ సెన్సార్ బోర్డు చీఫ్ అనుమతించారు. కానీ, కొందరు భారతీయులు మాత్రం ఇస్లామోఫోబియాగా వర్ణిస్తున్నారు’ అంటూ రాసుకొచ్చారు. కాగా, విమర్శలు, ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం ఇప్పటివరకు రూ. 300 కోట్లను వసూలు చేసిందని చిత్ర బృందం ప్రకటించింది.