ఏపీ స‌ర్కారు కీలక నిర్ణయం.. లేటుగా వస్తే లీవే - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ స‌ర్కారు కీలక నిర్ణయం.. లేటుగా వస్తే లీవే

February 26, 2022

jagan

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్న వారికి జగన్ సర్కార్ షాక్ ఇచ్చింది. ఇక నుంచి ఆఫీసుకీ లేటుగా వస్తే, ఆరోజు లీవే అంటూ కీలక ప్రకటన చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను శనివారం జారీ చేసింది.

ఆ ఉత్తర్వులో పేర్కొన్న అంశాలు ఇవే..
1.ప్రతి ఉద్యోగి 10 గంట‌ల‌కు కార్యాల‌యాల‌కు రావాలి.
2.10 నిమిషాల వ‌ర‌కు ఆల‌స్య‌మైతే ఫ‌ర‌వా లేదు.
3. అంత‌కు మించి ఒక్క నిమిషం లేటైనా సెల‌వు ప‌డిపోతుంది.
4.10.10 గంట‌ల నుంచి 11 గంట‌ల మ‌ధ్య‌లో కార్యాల‌యానికి వ‌చ్చేందుకు నెల‌కు మూడు ప‌ర్యాయాలు మాత్ర‌మే అనుమ‌తి.
5. ఆ ప‌రిమితి దాటేస్తే.. ఇక వేత‌నంలో కోత మొద‌లవుతుంది. అంటూ ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది.

మరోపక్క ఇప్ప‌టికే పీఆర్సీ విష‌యంలో వైసీపీ స‌ర్కారు వ్య‌వ‌హరించిన తీరుతో ఉద్యోగులు తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన సంగ‌తి తెలిసిందే. ఏదోలా ఆ స‌మ‌స్య తీరిపోయింద‌ని ఉద్యోగులు భావిస్తున్న‌ త‌రుణంలో మ‌రో షాకిచ్చింది. దీంతో ఏపీ ఉద్యోగుల్లో పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తోంది.