The lady teacher gave homework to the students to bring a condom with semen
mictv telugu

వీర్యంతో నిండిన కండోమ్ తేవాలన్న లేడీ టీచర్.. కట్ చేస్తే..

August 27, 2022

The lady teacher gave homework to the students to bring a condom with semen

పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన స్కూల్ టీచర్ వివాదాస్పద హొంవర్క్ ఇచ్చి టాక్ ఆఫ్ ది నేషన్‌గా నిలిచింది. సదరు హోం వర్క్ గురించి పేరెంట్స్‌కి తెలియడంతో వారు టీచర్‌పై మండిపడ్డారు. ఇదేం హోం వర్క్ అంటూ నిలదీసి పై అధికారులకు ఫిర్యాదు చేశారు. దేశమంతా ఆశ్చర్యపయిన ఈ ఘటన దక్షిణ అమెరికాలోని బొలీవియాలో చోటుచేసుకుంది.

ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మరియా ఐనెస్ అనే మహిళా టీచరు ఓ హైస్కూలులో సెక్స్ ఎడ్యుకేషన్ టీచరుగా పనిచేస్తోంది. ఈ క్రమంలో పిల్లలకు ఓ హొం వర్క్ ఇచ్చింది. వీర్యంతో నిండిన కండోమ్స్ తీసుకురావాలని చెప్పింది. దీనికి పిల్లలు మొదట షాకయినా టీచర్ ముందు ఏమీ మాట్లాడకుండా ఇళ్లకు వెళ్లిపోయి వారి పేరెంట్స్‌తో చెప్పుకున్నారు. దీంతో మండిపోయిన పేరెంట్స్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అంతేకాక, సోషల్ మీడియాలో పెట్టి దేశమంతా తెలిసేలా చేశారు. దీంతో స్పందించిన విద్యాశాఖ అధికారులు వివాదాస్పద హోం వర్క్ ఇచ్చిన టీచరును ఉద్యోగం నుంచి తొలగించారు. అనంతరం విచారణకు ఓ కమిటీని వేశారు. అటు ఈ ఘటనపై స్పందించిన టీచరు.. తన ఉద్దేశం మాత్రం వేరేలా ఉందని చెప్పుకొచ్చింది. వీర్యకణాలు తేమ వాతావరణంలో ఎంతకాలం జీవించగలవు? అనేది ప్రాక్టికల్‌గా చూపించాలనుకున్నానని మరియా తెలిపింది. అంతేకాక, ఆ కెమికల్ గురించి తెలియజేసి వాటికి దూరంగా ఉండాలని చెప్పాలనుకున్నట్టు వెల్లడించింది. తాను నలుగురు పిల్లలకు తల్లినని, ఈ ఆలోచన వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.