తెలంగాణ మంత్రుల భాష బాగలేదు - డీకే అరుణ - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ మంత్రుల భాష బాగలేదు – డీకే అరుణ

December 22, 2021

13

సీఎం కేసీఆర్‌పై, టీఆర్ఎస్ మంత్రులపై బీజేపీ సీనియర్ నాయకురాలు డీకే అరుణ ఫైర్ అయ్యారు. కేంద్ర మంత్రులపై తెలంగాణ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు, వాడుతున్న భాష సరిగా లేదని మండిపడ్డారు. మర్యాద లేకుండా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘గత ఏడాది ఖరీఫ్, రబీలో రాష్ట్ర ప్రభుత్వం కొన్న 27 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేంద్రానికి ఇవ్వాల్సి ఉందని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ స్పష్టంగా చెప్పారు’. ఈ ఏడాది ఖరీఫ్‌లో 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, మిగిలిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడానికి కేంద్రం సుముఖంగా ఉందని’ ఆయన స్పష్టం చేశారని తెలిపారు. అంతేకాకుండా యాసంగిలో బాయిల్డ్ రైస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రాసిన లేఖలో రైస్ ఇవ్వబోమని రాసిందని తెలిపారు. కానీ, ప్రస్తుతం సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు రైస్ విషయంలో కేంద్రం అన్యాయం చేస్తుందంటూ.. వారికి అనుగుణంగా అసత్యాలు ప్రచారాలు చేయడం మంచికాదన్నారు.