The largest bottle of whiskey in the world .. Price 10 crores ..
mictv telugu

ప్రపంచంలోనే అతిపెద్ద విస్కీ బాటిల్.. ధర 10 కోట్లు..

June 7, 2022

The largest bottle of whiskey in the world .. Price 10 crores ..

ప్రపంచంలోనే అతిపెద్ద విస్కీ బాటిల్‌కు తాజాగా వేలంపాట ముగిసిందని ప్రముఖ లియోన్ టర్న్‌బుల్ సంస్థ ప్రకటించింది. ఈ బాటిల్‌ ఫోటోలు, వివరాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఫోటోలను, వివరాలను చదువుతున్న యువకులు, మందుబాబులు, నెటిజన్స్ ఎంత పెద్ద విస్కీ బాటిల్ కూడా ఉంటుందా? మనకు తెలీదే! అంటూ ఆశ్చర్యపోతున్నారు.

”ఈ విస్కీ బాటిల్ 5 అడుగుల 11 అంగుళాల పొడవు ఉంటుంది. అందులో 311 లీటర్ల స్కాచ్ విస్కీ ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద విస్కీ బాటిల్‌గా నిలిచింది. ఈ విస్కీ బాటిల్ ధర సుమారు 1.4 మిలియన్లు డాలర్లు (సుమారుగా రూ. 10,85,88,900 కోట్లు). ఈ విస్కీకి ఇంట్రెపిడ్ అనే బ్రాండ్ పేరు పెట్టి వేలానికి ఉంచాం. ఇది ఒకే మాల్ట్. దాదాపు 32 సంవత్సరాల కాలం నాటిది. దీన్ని 1989లో స్పైసైడ్ మకాలన్ తయారు చేశారు. ఈ బాటిల్‌ దాదాపు 444 విస్కీ బాటిళ్లతో సమానం. సెప్టెంబర్ 2021లో విస్కీని నింపి గిన్నిస్ ప్రపంచ రికార్డులో స్థానం సంపాదించారు.”

ఇటీవలే ఈ విస్కీ బాటిల్‌కు స్కాట్‌ల్యాండ్‌ దేశంలో ఆన్‌లైన్‌లో ఉంచగా, సూమారు 10 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిందట. ఆ సీసాలో 311 లీటర్ల విస్కీ ఉంటుందట. ఈ విస్కీ బాటిల్‌కు మొత్తం వేలాన్ని స్వచ్చంద సంస్థలకు విరాళంగా ఇవ్వనున్నట్లు సమాచారం. ఏదిఏమైనప్పటికి ప్రపంచంలోనే అతిపెద్ద విస్కీ బాటిల్‌గా పేరుగాంచిన ఇంట్రెపిడ్‌ ధర హాట్ టాఫిక్‌గా మారింది.