మారుతీ సుజుకీ నుంచి సరికొత్తకారు..ధర తక్కువ..అదిరిపోయే ఫీచర్లు..!! - MicTv.in - Telugu News
mictv telugu

మారుతీ సుజుకీ నుంచి సరికొత్తకారు..ధర తక్కువ..అదిరిపోయే ఫీచర్లు..!!

February 15, 2023

The latest car from Maruti Suzuki comes with amazing features at a low price

మారుతీ సుజుకీ…ఈ పేరు వినగానే బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లు గుర్తుకు వస్తాయి. నెక్సా పేరుతో కొన్ని ప్రీమియం కార్ డిజైన్స్ ను మార్కెట్లోకి పరిచయం చేసింది. బలేనో, బ్రెజ్జా,ఎన్ క్రాస్ వంటి మోడల్స్ తో మారుతీ మార్కెట్లో తన స్టామినా నిరూపించుకుంది. ఇప్పుడు ఫ్రాంక్స్ పేరుతో మరో కొత్త మోడల్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. దీనిని బలేనో బ్రెజా, ఎస్ క్రాస్ ఫీచర్లతో తీసుకువచ్చారు. అదిరిపోయే ఫీచర్లు, బడ్జెట్ ఫ్రెండ్లీగా దీనిని మార్కెట్లోకి తీసుకువస్తుంది మారుతీ. సేఫ్టీ, ఫీచర్లు, టెక్నాలజీ విషయంలో ఎక్కడా కూడా రాజీ పడలేదని స్పష్టంగా కనిపిస్తోంది.

ఫీచర్లు..
ఇక ఈ కారు ఫీచర్లు చూసినట్లయితే…ఇది రెండు ఇంజియన్ వేరియంట్స్ వస్తోంది. ఒకటి 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, రెండు 1 లీటర్ టర్బో బూస్టర్ జెట్ ఇంజిన్. ఇందులో స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీని ఉపయోగించారు. పెడల్ షిఫ్టర్స్‌ తో 6 స్పీడ్ ఆటోమేటెడ్ గేర్ షిఫ్టింగ్ టెక్నాలజీ ఈ కారులో ఉంది. మాన్యువల్ అయితే 5 గేర్లతో రానుంది. హెడప్ డిస్ ప్లే, వైర్ లెస్ ఛార్జింగ్, 9 ఇంచెస్ డిస్‌ ప్లేతో స్మార్ట్ ప్లే ప్రో ప్లస్‌ సరౌండ్ సౌండ్, డ్యూయల్ టోన్ ప్లష్ ఇంటీరియర్, 360 డిగ్రీల కెమెరా వంటి ఎన్నో అద్భుతమైన ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి. అంతేకాకుండా 6 స్ట్రైట్ కలర్స్, 3 డ్యూయల్ టోన్ కలర్స్‌ తో ఈ కారు అందుబాటులోకి రానుంది.

సాధారణంగా మారుతి సుజుకి CNG మోడల్‌ను దాని వాహనాలలో ఏదైనా మిడ్-లెవల్ వేరియంట్‌లలో మాత్రమే పరిచయం చేస్తుంది. ఈ SUV సిగ్మా, డెల్టా, డెల్టా +, జీటా ఆల్ఫా అనే ఐదు ట్రిమ్‌లలో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. మొదటి మూడు వేరియంట్‌లు సిగ్మా, డెల్టా, డెల్టా ప్లస్ 1.2 లీటర్ ఇంజన్ ఎంపికను పొందుతాయి.

ధర:
లాంచ్ కు ముందు ధర గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. లీక్ లను బట్టి కంపెనీ ఈ ఎస్ యూవీని రూ. 8 లక్షల నుంచి రూ.11 లక్షలకు వరకు ఉండవచ్చని తెలుస్తోంది. ఇతర మోడళ్లతో పోల్చినట్లయితే…ఈ సీఎన్జీ వేరియంట్ సాధారన పెట్రోల్ వేరియంట్ కంటే దాదాపు రూ. లక్షల వరకు ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది.