రిలయన్స్ టెలికాం సంస్థ జియో తన వినియోగదారులకు మరో కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్ కాలపరిమితి నెల రోజులని పేర్కొంది. దీని ధర రూ.259 అని తెలిపింది. ఇప్పుడున్న ప్లాన్స్ ప్రకారం.. 24 రోజులు, 28 రోజులు, 56 రోజులు, 84 రోజుల కాలపరిమితి ఉంది. అయితే, జియో 259 ప్లాన్‌తో ఏప్రిల్ 1వ తేదీన రీచార్జ్ చేసుకుంటే, మళ్లీ మే 1న తేదీన రీచార్జ్ చేసుకోవచ్చని తెలిపింది. అంతేకాకుండా ఈ ప్లాన్ వల్ల అదనంగా వచ్చే వాటిని కూడా వెల్లడించింది.
ప్లాన్ వివరాలు చూస్తే..
1. రోజుకు 1.5 జీబీ డేటా,
2. అన్ లిమిటెడ్ కాల్స్,
3. ఇతర ప్రయోజనాలు అదనమని సూచించింది. ఇలా కచ్చితంగా నెలరోజులకు వర్తించేలా తీసుకువచ్చిన ప్లాన్ దేశంలో ఇప్పటివరకు ఇదొక్కటేనని తెలిపింది. ఇటీవల ట్రాయ్ టెలికాం సంస్థలకు పలు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నెల రోజుల కాలపరిమితితో రెగ్యులర్ ప్లాన్, స్పెషల్ టారిఫ్, కాంబో పథకాలను తప్పనిసరిగా వినియోగదారులకు అందించాలని ట్రాయ్ స్పష్టం చేసింది. దీంతో జియో ఈ ప్లాన్‌ను సోమవారం ప్రకటించింది. కావున వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రిలయన్స్ సంస్థ కోరింది.