The list of most polluted cities in the country has been released
mictv telugu

దేశంలోని కాలుష్య నగరాల జాబితా విడుదల.. మనవి ఎన్ని ఉన్నాయంటే

November 8, 2022

 

The list of most polluted cities in the country has been released

దేశంలో పెరుగుతున్న పట్టణీకరణ, పారిశ్రామికీకరణలతో మంచి ఫలితాలతో పాటు దుష్ర్పభావాలు కూడా భారీగా పడుతున్నాయి. వీటి వల్ల చిన్న నగరాలు సైతం అభివృద్ది అవడంతో పాటు కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నాయి. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకోగా.. స్వచ్ఛతకు మారుపేరుగా నిలిచిన నగరాలు కూడా కాలుష్యం బారిన పడడం ఆందోళన కలిగిస్తోంది.

తాజాగా దేశంలోని అత్యంత కాలుష్య నగరాల జాబితాను కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు విడుదల చేసింది. మొత్తం 163 నగరాలను లిస్టులో పేర్కొనగా, మొదటి స్థానంలో బీహార్‌‌లోని కతిహర్ (360) నిలిచింది. తర్వాత ఢిల్లీ (354), నోయిడా (328), ఘజియాబాద్ (304)లు నిలిచాయి. వీటితో పాటు బెగుసరాయ్, బల్లాబ్ ఘర్, ఫరీదాబాద్, కైతాల్, గుర్గావ్, గ్వాలియర్ నగరాలు అత్యంత కలుషితమైనవిగా నిర్ధారించింది. ఈ జాబితాలో తెలుగు నగరాలు కూడా ఉన్నాయి. హైదరాబాద్ (100), వైజాగ్ (202), అనంతపురం (145), ఏలూరు (61), తిరుపతి (95) ఉన్నాయి. పంజాబ్, హర్యానాలలో రైతులు పంట వ్యర్ధాలను కాల్చడం ద్వారా డిల్లీలో కాలుష్యం విపరీతంగా పెరిగిందని బోర్డు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కాల్చివేత ఘటనలు ఒక్కరోజులోనే పంజాబ్ వ్యాప్తంగా 3,634 చోటుచేసుకున్నట్టు రికార్డులు చెప్తున్నాయి.