The longest trin route in India
mictv telugu

భారతదేశం ఆ చివరి నుంచి ఈ చివరి దాకా….

November 21, 2022

ఇండియాలో రైల్వే ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలిసిందే. మనదేశంలో ఎక్కువమంది ప్రయాణాలు చేసేది రైల్లోనే. అయితే భారత్ లో అతి పెద్ద రైలు మార్గం ఏంటో మీకు తెలుసా. ఎక్కడ నుంచి ఎక్కడి వరకు అది తెలిస్తే ఆశ్చర్యపోతారు. మరి రండి దాని వివరాలేంటో చూసేద్దాం.

భారతీయ రైల్వేస్‌లో అతిపొడవైన రైలు రూట్ కలిగింది వివేక్ ఎక్స్‌ప్రెస్. ఇది అస్సాంలోని డిబ్రుగర్హ్ నుండి తమిళనాడులోని కన్యాకుమారి వరకు మొత్తం 8 రాష్ట్రాల్లో ప్రయాణిస్తూ విశిష్ఠ సేవలు అందిస్తోంది. మొత్తం 4,218 కిలోమీటర్ల దూరాన్ని ఈ రైలు సుమారు 80 గంటలు ప్రయాణం చేస్తుంది.దశాబ్దం క్రితం ప్రవేశ పెట్టిన వివేక్ ఎక్స్‌ప్రెస్ దేశంలోనే అతిపొడవైన రైలుగా మార్గంగా ప్రత్యేకతను సాధించింది.

సుమారు ఐదు రోజుల ప్రయాణం చేసే ఈ వివేక్ ఎక్స్‌ప్రెస్ వీక్లీ వన్స్‌ ఉంటుంది. ప్రతి శనివారం డిబ్రుగర్హ్‌లో ప్రారంభమై 8 రాష్ట్రాల్లో ప్రయాణిస్తూ సుమారు 80 గంటల తర్వాత కన్యాకుమారి చేరుకుంటుంది. ఇందులో మొత్తం 58 స్టేషన్లు ఉంటాయి.ప్రపంచ వ్యాప్తంగా 24వ లాంగెస్ట్ రైలు సర్వీస్‌గా ఇది పేరుగాంచింది. ఈ వివేక్ రైలు సేవల గురించి 2011-12 రైల్వే బడ్జెట్‌లో తొలిసారి వెల్లడించారు. 2013లో స్వామి వివేకానంద 150వ జయంతి రోజున దీన్ని మొదలుపెట్టారు. దీంతో ఈ రైలు 2011 నవంబర్ 11న ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఇది ప్రతి శనివారం రాత్రి డిబ్రుగర్హ్‌లో 10:45 గంటలకు ప్రారంభమై తిన్‌సుకియా, దిమాపూర్, గౌహతి, బొంగైగావ్, అలీపుర్‌దువార్, సిలిగురి, కిషన్‌గంజ్, మాల్దా, రాంపూర్‌హాట్, పాకూర్, దుర్గాపూర్, అసన్‌సోల్, ఖరగ్‌పూర్, బాలాసోర్, కటక్, భువనేశ్వర్, ఖోర్ధా, బ్రహ్మపూర్, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం,విజయనగరం, విశాఖపట్నం. ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, వెల్లూరు, సేలం, ఈరోడ్, కోయంబత్తూర్, పాలక్కాడ్, త్రిసూర్, అలువా, ఎర్నాకులం, కొట్టాయం, చెంగన్నూర్, కొల్లాం, తిరువనంతపురం, నాగర్‌కోయిల్ స్టేషన్ల మీదుగా కన్యాకుమారి చేరుకుంటుంది.

ఇండియాలో లాంగ్ రూట్ ట్రైన్ లలో ఫస్ట్ ది వివేక్ ఎక్స్‌ప్రెస్ అయితే తర్వాత సిల్‌చార్ – తిరువనంతపురం సెంట్రల్ అరోనాయ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు రెండవ స్థానంలో ఉంది. ఇది 3,932 కిలోమీటర్లు దూరం ప్రయాణిస్తుంది. ఇక మూడవది కన్యాకుమారి – మాతా వైష్ణోదేవి కాట్రా హిమసాగర్ ఎక్స్‌ప్రెస్. ఇది కూడా దాదాపు 3,782 కిలోమీటర్లు తిరుగుతుంది. తరువాతి స్థానాల్లో తిరునల్వేలి జంక్షన్ – కాట్రా నవయుగ్ ఎక్స్‌ప్రెస్… 3,628 కిలోమీటర్లు, అగర్తాల -యా ఎక్స్‌ప్రెస్ 3,599 కిలోమీటర్ల దూరంతో వరుసగా ఉన్నాయి.