The lorry collided with a car in Markapuram
mictv telugu

మార్కాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం

May 17, 2022

The lorry collided with a car in Markapuram

ప్రకాశం జిల్లా మార్కాపురం‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు మంటల్లో చిక్కుకొని సజీవ దహనమయ్యారు. వివరాలు.. మండలంలోని తిప్పాయపాలెం వద్ద ఎదురెదురుగా వస్తున్న లారీ, కారు రెండూ ఢీకొన్నాయి.

దీంతో కారులో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ముగ్గురు ప్రయాణీకులు తేరుకునేలోపే సజీవ దహనమయ్యారు. కారు పూర్తిగా ధ్వంసమైపోయి కాలిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవరు లారీని అక్కడే వదిలేసి క్లీనర్‌తో సహా పారిపోయారు. ఫైర్ సిబ్బందికి సమాచారం అందగా, వారు వచ్చి మంటలు ఆర్పివేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని లారీని సీజ్ చేశారు. పారిపోయిన నిందితుల కోసం దర్యాప్తు ప్రారంభించారు.