The love story that inspired the movie..17 people were arrested
mictv telugu

సినిమాను తలపించిన లవ్‌స్టోరీ..17మంది అరెస్ట్

August 5, 2022

తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా జన్నారం మండలం మోర్రిగూడ గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున సినిమాను తలపించేలా ఓ లవ్‌స్టోరీ జరిగింది. మోర్రిగూడెంకు చెందిన కోట నాగేష్, సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామకి చెందిన లక్ష్మి అనే యువతి, యువకుడు కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఆ విషయాన్ని ఇరు కుటుంబాలకు తెలియజేశారు. కానీ, పెద్దలు వాళ్ల పెళ్లికి ఒప్పుకోలేదు. చేసేదేమీ లేక ఇంటి నుంచి పారిపోయి తాజాగా లక్ష్మి, కోట నాగేష్ పెళ్లి చేసుకున్నారు.

అనంతరం ప్రేమించి పెళ్లి చేసుకున్న లక్ష్మి, తన భర్తకు ఇంటికి వచ్చేసింది. విషయం తెలుసుకున్న లక్ష్మి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో రగిలిపోయి, మోర్రిగూడకు వచ్చి, నాగేష్ ఇంట్లోకి చొరబడి, అతడిపై తీవ్రంగా దాడి చేసి, లక్ష్మిని బలవంతంగా లాక్కెళ్లి కారులో ఎక్కించి తీసుకెళ్లిపోయారు.

ఆ సమయంలో ఆమె గట్టిగా కేకలు వేసింది. అంతే, అక్కడున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో, సినిమాల్లో చూయించినట్టుగానే ఎస్ఐ సతీష్ తన సిబ్బందితో కలిసి వారి కారును వెంబడించారు. దండేపల్లి మండలం ముత్యంపేట వద్ద మూడు వాహనాలను అడ్డుకుని, లక్ష్మిని రక్షించారు. అంతేకాదు, ఈ ఘటనకు పాల్గొన్న 17 మందిని అదుపులోకి తీసుకొని, వారిని స్టేషన్‌కు తరలించి, వారిపై కిడ్నాప్ సహా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.