The makers have released the deleted scene in Seetharam movie
mictv telugu

ఇండియాలో ఇంకా నీలాంటి వాళ్లున్నారన్న మాట – సీతారామం డిలీటెడ్ సీన్ వైరల్

September 7, 2022

 

డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కించిన తాజా చిత్రం సీతారామం. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా, రష్మిక మందన్న, సుమంత్ కీలక పాత్రల్లో నటించారు. యుద్దం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించింది. ఈ అందమైన ప్రేమకథ దక్షిణాదిలోనే కాక హిందీలో కూడా మంచి పేరు తెచ్చుకుంది. విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతం శ్రోతలను ఆకట్టుకుంది. సినిమా రిలీజై నెలరోజులవగా, అందులో డిలీట్ చేసిన సీన్‌ని మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. అందులో సీతామహాలక్ష్మీ కోసం వెతుకుతూ రష్మిక క్యాబ్‌లో ఓ ప్యాలెస్ వద్దకు వెళ్తుంది. అయితే దిగే క్రమంలో బ్యాగ్ మర్చిపోతుంది. కాసేపటికి తిరిగి వచ్చి అక్కడే ఉన్న క్యాబ్ డ్రైవరుతో ‘ఇండియాలో ఇంకా నీలాంటి వాళ్లున్నారన్న మాట’ అని చెప్తుంది. దానికి డ్రైవరు ‘ఇండియాలో అందరూ నాలాంటి వాళ్లే ఉంటారు. మీ బ్యాగ్  తీసుకెళ్లి నా దేశం పరువును మీతో పంపలేను కదా మేడం’ అంటూ బ్యాగ్ ఇచ్చేస్తాడు. ఇంత అద్భుతమైన సీన్ ఎందుకు తీసేశారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.