The man did a circus stunt by making his wife sit on the bullet
mictv telugu

బుల్లెట్ బండిపై భార్యతో భర్త సర్కస్..

November 19, 2022

The man did a circus stunt by making his wife sit on the bullet

ఈ మధ్యకాలంలో బైక్‌పై స్టంట్ చేయడం ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి ఒక్కరు బైక్‌పై స్టంట్ చేయడం.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అలవాటుగా మారింది. దీంతో బైక్ స్టంట్ వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. రకరకాలు స్టంట్‌లు చేసి రైడర్‌లు ఆశ్చర్యపరుస్తున్నారు. ప్రమాదం అని తెలిసినా పట్టించుకోకుండా రిస్క్ చేస్తున్నారు. తాజాగా ఓ యువకుడు చేసిన స్టంట్ వైరల్‌గా మారింది.

బుల్లెట్ నడుపుతున్న వ్యక్తి బైక్ సీటుపై రెండు కాళ్లు ఉంచి ఒక్కసారిగా నిల్చొన్నాడు. ఆపై నెమ్మదిగా హ్యాండిల్‌ను వదిలేశాడు. దీనిలో ఏముంది అందరూ చేస్తున్నారు కదా అనుకుంటే పొరబాటే. ఈ సారి ఆ యువకుడు కొంచెం కొత్తగా ట్రై చేశాడు. బైక్ వెనుక సీట్‌లో భార్యను కూర్చోబెట్టి ఈ ఫీట్ చేశాడు. ఆమె ఏ మాత్రం బెదరకుండా, భయం లేకుండా అలానే కూర్చొంది. ప్రస్తతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది ఈ వీడియోను చూసి నెటిజన్లు అతనిని దుమ్మెత్తి పోస్తున్నారు. ఫీట్ చేయడమే నేరం ఐతే ఇంకా భార్యను కూర్చొబెట్టి చేయడానికి సిగ్గులేదా అంటున్నారు. అదుపుతప్పి కింద పడితే భారీ మూల్యం తప్పదని హెచ్చరిస్తున్నారు. కొంతమంది మాత్రం అమె ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే అంటూ సపోర్ట్ చేస్తున్నారు.