తమిళనాడులో ఓ వ్యక్తిని దిగ్భ్రాంతికర రీతిలో అనుకోకుండా చంపేశారు. మధురైలో సతీష్ అనే వ్యక్తి ఓ గుంతలో డ్రైనేజీ పైపులు బిగించే పని చేస్తున్నాడు. ఇది గమనించకుండా అతనిపై మట్టి పోసి కప్పేశారు. కాసేపయ్యాక గుంత లోపల ఉండిపోయిన సతీష్ గుర్తొచ్చి తోటి కార్మకులు కంగారు పడ్డారు. దాంతో వెంటనే అక్కడ ఉన్న జేసీబీ సహాయంతో కప్పిన మట్టిని తవ్వి తీయగా, ప్రమాదవశాత్తు జేసీబీ హ్యాండ్ తగిలి సతీష్ తల తెగిపోయింది. ఈ సంఘటనను కళ్లారా చూసిన మిగతా కార్మికులు దిగ్బ్రాంతికి గురయ్యారు. విషయం తెలిసి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సైట్ ఇంజినీర్, సూపర్ వైజర్, జేసీబీ ఆపరేటర్లపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. దుర్ఘటన గురించి తెలిసిన ముఖ్యమంత్రి స్టాలిన్ విచారం వ్యక్తం చేస్తూ మృతుడి కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్ధిక సహాయాన్ని ప్రకటించారు.