The man threw his cell phone in the sea
mictv telugu

చేప దొరికిన ఆనందంలో..సెల్‌ఫోన్ విసిరిన అధికారి

September 14, 2022

నేటి ఆధునిక కాలంలో స్మార్ట్‌ఫోన్లు వ్యక్తుల జీవితాల్లో భాగమైపోయాయి. ఎంతలా అంటే అది లేకుంటే ఒక్కరోజు గడపడానికైనా ఊహించడానికే భయపడేంత. ప్రపంచం మొత్తం అందులో అందుబాటులో ఉండడంతో పాటు సెల్ఫీలు, వీడియోలు వంటివి సరదాగా చేసుకోవచ్చు. ఈ మధ్య ఎక్కువ మంది షార్ట్ వీడియోలు అంటూ తెగ తీసేసుకుంటున్నారు. మామూలుగా అయితే పర్వాలేదు కానీ, ఈ మధ్య బరితెగించి ప్రాణాంతకమైన ప్రదేశాల్లో కూడా ఇలాంటి వీడియోలు తీసి ప్రాణాలమీదకి తెచ్చుకుంటున్నారు. కొందరు ఆ ఆనందంలో ఏం కోల్పోతున్నామో తెలియక విలువైన వస్తువులను పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి సంఘటనే ఈ వీడియోలో ఉంది. అందరిలానే సెల్ఫీలు, వీడియోలు అంటూ తెగ మురిసిపోయిన ఓ వ్యక్తి ఆ ఆనందంలో సెల్‌ఫోన్‌నే నీటిలో పడేశాడు. తర్వాత ఎంత పనైపోయిందంటూ తల పట్టుకున్నాడు. వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి సరదాగా సముద్రంలో బోటులో షికారు చేస్తూ ఉంటాడు. కాసేపటికి బోటులో ఉన్న ఓ చేపను పట్టుకొని సెల్ఫీలు, వీడియోలు రకరకాల యాంగిల్స్‌లో దిగుతాడు. ఆ సెషన్ అయిపోగానే చేపను నీటిలో పడేయబోయి పొరపాటున చేతిలో ఉన్న ఫోన్ పడేసుకుంటాడు. క్షణాల వ్యవధిలోనే తాను చేసిన పొరపాటును గ్రహించి ఫోన్ పడ్డ ప్రాంతానికి చేరుకుంటాడు. కిందకు వంగి ఫోన్ కోసం ప్రయత్నిస్తాడు కానీ, అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది.