80 వేలతో కుక్కకు విగ్రహం.. త్వరలో ఆలయం - MicTv.in - Telugu News
mictv telugu

80 వేలతో కుక్కకు విగ్రహం.. త్వరలో ఆలయం

April 5, 2022

dog

విశ్వాసంగా పనిచేయడంలో కుక్కలు అన్ని ప్రాణుల కంటే ముందుంటాయి. అందుకోసమే చాలా మంది వాటిని పెంచుకుంటారు. ఈ క్రమంలో కొందరు తమ కుక్కలతో ఎమోషనల్ బాండింగ్ పెంచుకుంటారు. తమిళనాడులోని ముత్తు ఈ కోవలోకే వస్తారు. ముత్తు టామ్ అనే కుక్కను 2010 నుంచి పెంచుకుంటుండగా, 2021లో టామ్ అనారోగ్యం కారణంగా చనిపోయింది. ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి రిటైర్ అయిన ముత్తు.. చనిపోయిన తన కుక్క గుర్తుగా 80 వేల రూపాయలతో పాలరాతితో విగ్రహం తయారు చేయించారు. అంతేకాక, దానికి ప్రతీ శుక్రవారం పూలతో అలంకరిస్తారు. నైవేద్యం పెట్టి తమ ఇంట్లో మనిషిలా భావించి పూజిస్తున్నాడు. ఇంతటితో ఆగకుండా త్వరలో గుడి కట్టిస్తానని చెప్తున్నారు.