55 మందిని రక్షించిన ఆపద్బాంధవుడు - MicTv.in - Telugu News
mictv telugu

55 మందిని రక్షించిన ఆపద్బాంధవుడు

May 15, 2022

ఇటీవలే దేశ రాజధాని ఢిల్లీలో అగ్ని ప్రమాదం జరిగి, 27 మంది సజీవ దహనమైన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదానికి సంబంధించి అధికారులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తుండగా ఓ వ్యక్తి చేసిన సాహసం అధికారుల మనసులను కదిలించింది. ఘటనా స్థలానికి అగ్నిమాపక యంత్రాలు చేరుకోకముందే, ఆపద్బాంధవుడిలా వచ్చి రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టాడు. ఆ ఘటనలో దాదాపు 50 నుంచి 55 మందిని రక్షించి, అందరి చేత శభాస్ అనిపించుకున్నాడు. ప్రస్తుతం ఆ ఆపద్బాంధవుడిపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది.

”ముంద్కా మెట్రో స్టేషన్ సమీపంలోని ఓ మూడంతస్తుల భవనంలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అదే సమయంలో ముంద్కా ఉద్యోగ నగర నుంచి క్రేన్‌తో అటుగా వెళ్తోన్న దయానంద్ తివారీ, అగ్ని ప్రమాదాన్ని గుర్తించాడు. క్రేన్ యజమాని, ఓ సహాయకుడుతో కలిసి ఘటన స్థలానికి చేరుకున్నాడు. అరుపులు, కేకలు వేస్తూ, రక్షించండి అంటూ వేడుకున్న వారిని రక్షించే కార్యక్రమం మొదలుపెట్టాడు. అగ్నిమాపక యంత్రాలు అక్కడికి చేరుకొనేలోపే స్థానికుల సహాయంతో దాదాపు 50 నుంచి 55 మంది ప్రాణాలను కాపాడాడు. మరింత మందిని కాపాడాలనే ప్రయత్నం చేసినప్పటికీ మంటలు వేగంగా వ్యాప్తి చెందడంతో మిగతావారిని కాపాడలేకపోయానని దయానంద్ తివారీ ఆవేదన వ్యక్తం చేశాడు”.