పంది గుండె పెట్టుకున్న వ్యక్తి మృతి - MicTv.in - Telugu News
mictv telugu

పంది గుండె పెట్టుకున్న వ్యక్తి మృతి

March 10, 2022

03

ప్రపంచంలోనే తొలిసారిగా పంది గుండెను అమర్చిన వ్యక్తి మృతి చెందాడు. వివరాలు.. డేవిడ్ బెన్నెట్ అనే వ్యక్తికి రెండు నెలల క్రితం అమెరికాలోని మేరీల్యాండ్ ఆసుపత్రిలో గుండెమార్పిడి చేశారు. మనిషి గుండెకు బదులుగా జన్యుమార్పిడి చేసిన పంది గుండెను బెన్నెట్‌కు అమర్చారు. అయితే కొన్ని రోజులుగా బెన్నెట్ ఆరోగ్యం పాడవుతుండడంతో డాక్టర్లు ఎంతో ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోవడంతో మంగళవారం రోజు బెన్నెట్ చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు. ఈ విషయాన్ని మృతుడి కుమారుడు నిర్ధారించాడు. కాగా, గతంలోనూ ఇలాంటి ప్రయోగమే జరుగగా, అది కూడా ఇలానే విఫలమైంది. 1984లో కోతి గుండెను మనిషికి అమర్చగా… అతను 21 రోజులు మాత్రమే జీవించాడు. అయితే పంది గుండెతో బెన్నెట్ రెండు నెలలు జీవించడాన్ని కొంత ముందడుగుగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.