నందమూరి నటసింహం బాలయ్య నటించిన వీరసింహారెడ్డి మూవీ నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తెలుగు రాష్ట్రాలతో పాటు పక్కనున్న తమిళనాడు,కర్ణాటకలో బాలయ్య ఫ్యాన్స్ పండుగ జరుపుకుంటున్నారు. రెండు రోజులముందే తమ హీరో సంక్రాంతి పండుగ తెచ్చాడని సంబరాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఏపీలోని నంద్యాలలోని మిని ప్రతాప్ థియేటర్ లో వీరసింహారెడ్డి సినిమా కాసేపు నిలిచిపోయింది. తెల్లారి జామున 5 గంటలకే ప్రారంభమైంది సినిమా షో. వివిధ కారణాల వల్ల రెండు సార్లు 45 నిమిషాల పాటు సినిమా నిలిచిపోయింది. దీంతో బాలయ్య అభిమానులు ఆందోళన చేపట్టారు. తర్వాత సినిమా యధావిధిగా కొనసాగింది. సాంకేతిక లోపాలే కారణమంటున్నారు థియేటర్ సిబ్బంది.
ఇక అమెరికాలో బాలయ్య అభిమానులు హంగామా చేశారు. థియేటర్ మొత్తం కాగితాలు విసిరి రచ్చ రచ్చ చేశారు. దీంతో సినిమాను మధ్యలోనే ఆపేసిన థియేటర్ యాజమాన్యం.. ప్రేక్షకులందర్నీ బయటకు పంపించేసింది. గతంలో తాము చాలా తెలుగు సినిమాలను ప్రదర్శించామని .. కానీ ఎప్పుడ ఇలాంటి పరిస్థితి చూడలేదని యాజమాన్యం తెలిపింది. మిగతా థియేటర్లలో కూడా జై బాలయ్య అని అరవొద్దని చెప్పారు.
ఈ సినిమాలో ప్రతి సీన్లోనూ, ప్రతి షార్ట్లోనూ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయిందని అభిమానులు చెబుతున్నారు. గతంలో బాలయ్య – తమన్ కాంబోలో వచ్చిన అఖండ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అయింది.