బొద్దింకలను చంపబోయి..మూడు కార్లను తగలెట్టాడు - MicTv.in - Telugu News
mictv telugu

బొద్దింకలను చంపబోయి..మూడు కార్లను తగలెట్టాడు

November 9, 2019

మీ ఇంట్లో బొద్దింకలు ఉంటే ఏం చేస్తారు? ఏదైనా హిట్ లేదా క్రిమిసంహారక మందు ఏదైనా కొట్టి చంపేస్తారు. చైనాకు చెందిన ఓ వ్యక్తి కూడా అదే చేశాడు. ఆ మందు మరింత ప్రభావంగా పనిచేయాలనే ఉద్దేశంతో దానికి నిప్పు పెట్టాడు. 

దీంతో ఒక్కసారిగా మంటలు భగ్గుమన్నాయి. మూడు కార్లు దగ్దమయ్యాయి. ఈ ఘటన చైనాలోని క్యాన్‌జౌ నగరంలో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి వంట గదిలో బొద్దింకల బెడద ఎక్కువ కావడంతో విసిగిపోయాడు. దీంతో మండే స్వభావం గల క్రిమిసంహార మందు తీసుకొచ్చి వంటగదిలో పిచికారీ చేశాడు. ఆ తర్వాత దానికి నిప్పు పెట్టాడు. అంతే.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు రోడ్డు మీదకు వ్యాపించాయి. అక్కడ పార్కు చేసి ఉంచిన మూడు కార్లు తగలబడ్డాయి. ఈ ఘటనలో బొద్దింకలు చనిపోయాయో లేదో తెలియదు గానీ..కార్లు కాలిపోవడంతో రూ.31 లక్షలు నష్టం వచ్చింది. ఈ ఘటన రోడ్డుపై ఉన్న సీసీటీవీ కెమేరాలో రికార్డైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.