హైదరాబాద్ నగరంలో మావోయిస్టుల అరెస్టు కలకలం రేపింది. నగరంలో ఉంటున్న ఇద్దరు మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. మావోయిస్టులు మధుకర్, చిన్నాతోపాటు ఆయన భార్య శ్యామలను పోలీసులు అదుపులోకి తీసుకుని మహారాష్ట్రలోని గడ్చిరౌలీకి తరలించారు. వీరు హైదరాబాద్ ఉంటూ వేర్వేరు చోట్లు పనిచేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందించింది. వీరందరూ పలు దాడుల్లో కీలక నిందితులు. అంతేకాదు వీరిపై రూ. 10లక్షల రివార్డు కూడా ఉందని పోలీసులు తెలిపారు.
2005లో గడ్చిరౌలి నుంచి వచ్చి హైదరాబాద్ లోని హయత్ నగరలో నివాసం ఉంటున్నారు. ఇందులో మధుకర్ చిన్నా ప్రైవేట్ ట్రావెల్స్ దగ్గర సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా..అతని భార్య శ్యామల ఓ షాపింగ్ మాల్లో సేల్స్ ఉమెన్ గా పనిచేస్తోంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పక్కా ప్లాన్ తో వారిద్దరిని సోమవారం అరెస్టు చేశారు. అనంతరం గడ్చిరౌలికి తరలించారు. ఇన్ని రోజులు తమ ఉనికి తెలియకుండా జాగ్రత్త పడ్డారు.