The minor boy who lost 36 lakhs by playing the game online
mictv telugu

HYD : ఆన్‌లైన్లో గేమ్ ఆడి 36 లక్షలు పోగొట్టిన మైనర్ బాలుడు

June 4, 2022

The minor boy who lost 36 lakhs by playing the game online

సెల్‌ఫోన్ల వాడకం, వాటి దుష్పభావాలు నేటి పిల్లలపై ఎంత ప్రభావం చూపెడతాయో చెప్పడానికి ఈ సంఘటన ఓ ఉదాహరణ. చాలా మంది ఆ మైకంలో పడి కుటుంబాన్ని బలి చేస్తున్నారు. చిన్న వయసులోనే పందాలు అంటూ దాచుకున్నదంతా ఊడ్చేస్తున్నారు. అంబర్‌పేటకు చెందిన ఓ మైనర్ బాలుడు చేసిన పని అలాంటిదే. పోలీసులు తెలిపిన వివరాల మేరకు 16 ఏళ్ల బాలుడు తన తాత మొబైల్ తీసుకొని అందులో ఫ్రీఫైర్ అనే ఆన్‌లైన్ గేమ్ డౌన్‌లోడ్ చేసుకున్నాడు.

అనంతరం గేమ్ స్టార్ట్ చేసి తాత ఫోనులో ఉన్న తల్లి అకౌంటును ఆడ్ చేసి తొలుత రూ. 1500తో గేమ్ ఆడడం మొదలు పెట్టాడు. క్రమంగా ఆ మొత్తాన్ని పది వేలకు పెంచాడు. అలా హెచ్‌డీఎఫ్‌సీ ఖాతా నుంచి రూ. 9 లక్షలు పోగొట్టాడు. తర్వాత ఎస్‌బీఐ ఖాతాను అటాచ్ చేసి వరుసగా రూ. 27 లక్షలు ఖాళీ చేసేశాడు. ఈ విషయం తెలియని బాలుడి తల్లి డబ్బు అవసరమై బ్యాంకుకు వెళ్లగా అకౌంటు ఖాళీ అయిందని వారు చెప్పడంతో ఖిన్నురాలైంది. వెంటనే సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించగా, బాలుడి భాగోతం బయటపడింది. కాగా, పోలీస్ అయిన తన భర్త చనిపోతే ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులు అనీ, తనకు న్యాయం చేయాలనీ పోలీసులను వేడుకుంది.