The Missing Turtle was founded 40 years later
mictv telugu

ఆశ్చర్యం.. తప్పిపోయి 40 ఏళ్లకు తిరిగొచ్చిన తాబేలు

June 4, 2022

The Missing Turtle was founded 40 years later

పెంపుడు జంతువులను మనం మన ఆనందం కోసం, సరదా కోసం పెంచుకుంటాం. రోజులో కాసేపు వాటితో గడిపి ఉల్లాసాన్ని పొందుతాం. ఆ క్రమంలో వాటితో మనకు ఒకలాంటి అనుబంధం ఏర్పడుతుంది. అలాంటిది ఒక్కసారిగా అవి కనపడకుండా పోతే మనసు ఎంతో బాధపడుతుంది. సరిగ్గా ఇలాంటి ఫీలింగే ఓ తాబేలును పెంచుకున్న కుటుంబానికి ఇలాగే జరిగింది.

కుటుంబ యజమాని ఓ ప్రత్యేక జాతికి చెందిన తాబేలుకు మాన్యులా అని పేరు పెట్టుకున్నారు. అల్లారు ముద్దుగా దానికి ఆహారం పెడుతూ ప్రేమగా పెంచుతున్నారు. 1982లో ఓ రోజు ఇంటిపై కరెంటు పనులు జరుగుతుండగా మాన్యులా తప్పిపోయింది. తిరిగి ఇప్పుడు అదే ఇంటిలోని అటక మీద దొరికింది. ఓ పాత చెక్క పెట్టెలో కనిపించగా.. చూస్తే అది ఇంకా ప్రాణాలతోనే ఉంది. తాబేలును చూసిన ఇంటివారు ఆశ్చర్యపోయారు. యజమాని భార్య భావోద్వేగానికి లోనై ఏడ్చేసింది. తరచి చూడగా, అది మగజాతికి చెందినదని తేలడంతో పేరు మార్చి మాన్యుయేల్ అని పెట్టుకున్నారు. అనంతరం వైద్యులకు చూపించగా, ఎర్రటి పాదాలు ఉన్న ఇలాంటి తాబేళ్లు సంవత్సరాల తరబడి ఆహారం లేకుండా జీవించగలవని చెప్పారు.