The most affordable micro electric vehicle EAS - e launched in Mumbai
mictv telugu

మార్కెట్లోకి అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు.. రేపే విడుదల

November 15, 2022

స్వదేశంలో తయారైన అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు బుధవారం మార్కెట్లోకి విడుదల కానుంది. పీఎంవీ ఎలక్ట్రిక్ సంస్థకు చెందిన మైక్రో ఎలక్ట్రిక్ వెహికిల్ ఈఏఎస్ – ఈ కారు ధర 4 నుంచి 5 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. ముంబైకి చెందిన ఈ కంపెనీ కారును మూడు వేరియంట్లలో అందుబాటులోకి తేనుంది. మొత్తం 13 రంగుల్లో ఈ కారు లభ్యం కానుంది. కంపెనీ తెలిపిన సమాచారం మేరకు ఒక్క సారి ఛార్జ్ చేస్తే 120 నుంచి 200 కిలోమీటర్ల వరకు పయనిస్తుంది. 3కేడబ్ల్యూ ఎసీ ఛార్జర్‌‌ని ఆఫర్ చేస్తుండగా, బ్యాటరీ మొత్తం ఛార్జ్ కావడానికి నాలుగు గంటల సమయం పట్టనుంది. ఇక కారు ప్రత్యేకతలు చూస్తే ఈ విధంగా ఉన్నాయి. ఇందులో డిజిటల్ ఇన్‌‌ఫోటైన్మెంట్ సిస్టమ్, యూఎస్‌‌బీ ఛార్జింగ్ పోర్ట్, క్రూజ్ కంట్రోల్, సీటు బెల్టులు, ఏసీ, రిమోట్ కీ లెస్ ఎంట్రీ, రిమోట్ పార్క్ అసిస్ట్ వంటివి ఉన్నాయి. పొడవు 2,915 ఎంఎం, వెడల్పు 1,157 ఎంఎం, ఎత్తు 1600 ఎంఎంగా ఉంది. బరువు 550 కేజీలు, వీల్ బేస్ 2,087 ఎంఎం, గ్రౌండ్ క్లియరెన్స్ 170 ఎంఎంగా ఉంది. కాగా, ఈ కారును గతంలో టాటా కంపెనీ తెచ్చిన నానోతో పోలుస్తున్నారు. ఎలక్ట్రిక్ విభాగంలో మధ్య తరగతి వారికి నచ్చే, మెచ్చే మోడల్ అవుతుందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.