The most expensive liquor in the world
mictv telugu

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మద్యం

November 17, 2022

మందు…కొంత మందికి అడిక్షన్ అయితే మరికొంత మందికి స్టేటస్ సింబల్. చాలా మంది తినడం మానేస్తారు కానీ మద్యం తాగడం మాత్రం మానేయరు. ఇక ఆల్కహాల్ వెరైటీల సంగతి అయితే చెప్పక్కరల్లేదు. మనకే బోలెడు రకాలు దొరుకతాయి ఇక్కడ. ఇక విదేశాల్లో అయితే చెప్పనే అక్కర్లేదు. అత్యంత చీప్ లిక్కర్ నుంచి సైపర్ కాస్ట్లీ వరకు బోలెడు రకాలు మార్కెట్లో అవైలబుల్ గా ఉంటాయి.

ఖరీదైన మద్యం తయారు చేయడం ఒక ఫ్యాషన్. సంపన్నుల కోసం సూపర్ కాస్ట్లీ మందు తయారు చేసేందుకు మద్యం తయారీదారులు పోటీపడుతుంటారు కూడా. వీటిల్లో రంగు, రుచి, వాసనలాంటివే కాకుండా సీసాలకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎంతలా అంటే వజ్రాలు, ప్లాటినాలు బాటిల్స్ లో పెట్టి మరీ తయారు చేసేంతలా. అలా చేసిన వాటిల్లో టాప్ ఫైవ్ లో ఉన్న లిక్కర్ పేర్లు ఏంటో మీకు తెలుసా. అవి ఎందుకు అంత స్పెషల్, ఖరీదో తెలుసా….చూసేద్దాం రండి.

మకాల్లన్:
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, రేర్ విస్కీ ఇది. 1926 మకాల్లన్ ఫైన్ అండ్ రేర్ కలెక్షన్ అనే పిలిచే ఈ విస్కీని కేవలం 40 బాటిల్స్ మాత్రమే తయారు చేశారు. 1987లో న్యూయార్క్ లో 5 వేల పౌండ్లకు దీన్ని వేలం వేశారు. అత్యంత ఖరీదైన కళాఖండాలు వేలం వేసే సూడ్ బీస్ వెబ్ సైట్లో కూడా ఇది చోటు దక్కించుకుంది. 2019లో మళ్ళీ వేలం వేసినప్పుడు మకాల్లన్ విస్కీ ఏకంగా 14,52, 000 పౌండ్లకు అమ్ముడుబోయిందట. అంటే మన రూపాయల్లో అక్షరాలా 13 కోట్ల 78 లక్షలు అన్నమాట.

హెన్రీ…
ఇది వైన్ లలో అత్యంత ఖరీదైనది. దీని బాటిల్ లో 24 క్యారెట్ల బంగారం, ప్లాటినం కలిపి తయారు చేశారుట. అంతే కాదు 6,500 అన్ కట్ డైమండ్స్ కూడా పొదిగారట. వైన్ ఎంత పాతదయితే అంత బావుంటుంది అంటారు. అందుకే హెన్రీ వైన్ ను 100 ఏళ్ళకు బారెల్ లో ఉంచి మరీ తయారు చేశారుట. ఈ వైన్ వెయ్యి మిల్లీలీటర్ల బాటిల్ ధర 2 మిలియన్లు….అంటే 16 కోట్లు.

టెకీలా లే 295 డైనమైట్:
టెకీలాలో సైపర్ కాస్ట్లీ ఇది. బ్లూ కిత్తలి అనే దాని నుంచి తయారైన మెక్సికన్ మందుట ఇది. దీని బాటిల్ లో కూడా 2 కిలోల ప్లాటినం, 4వేలకు పైగా తెల్లవజ్రాలు పెట్టారుట. దీని విలువ సుమారు 28 కోట్లు ఉంటుందిట.

బిలయనీర్ వోడ్కా:
ఇది నిజంగా బాగా డబ్బులు ఉంటే కానీ తాగలేని వోడ్కా. దీన్ని డిమాండ్ కు తగ్గట్లే రడీ చేస్తారుట పైగా. ఈ వోడ్కా రెసిపీ కూడా చాలా సీక్రెట్ అంట. రష్యన్ రెసీపీ అంటారు దీన్ని. తక్కువ క్వాంటిటీలోనే ఈ వోడ్కాను తయారు చేస్తారు. దీని కోసం ట్రిపుల్ డిస్టిల్డ్ వాటర్ ఉపయోగిస్తారు. దీని బాటిల్ పైన వజ్రాల పూత ఉంటుంది. దీని ధర దాదాపు 30 కోట్లు.

ఇసాబెల్లా ఇస్లే:
ఇది కూడా మరొక రకమైన వైన్. దీనిలో వైన్ స్పెషాలిటీ కన్ని బాటిల్ స్పెషాలిటీనే ఎక్కువ. బంగారం, వజ్రాలు మాత్రమే కాకుండా 300 నీలమణులు కూడా పెట్టి దీని బాటిల్ తయారు చేస్తారుట. దీని విలువ 50 కోట్లకు పైమాటే.

అవండీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లిక్కర్లు. వీటిని తాగడం మాట అటుంచితే వీటిని కొనుక్కుని తమ ఇళ్ళల్లో పెట్టుకోవడం చాలా ప్రెస్టీజ్ గా భావిస్తారుట డబ్బున్నోళ్ళు. అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు కూర్చుని తిన్నా తరిగిపోని ఆస్తి ఉంటే కానీ ఇలాంటి వాటిని కొనుక్కుని ఇళ్ళల్లో పెట్టుకోలేరు. సాధారణ మనుషులకు అయితే పేరు తెలియడం కూడా గొప్ప విషయమే.