ఈ డెలివరీ బాయ్ కథ వింటే కదిలిపోతారు..(వీడియో)
కరోనా ప్రభావంతో ప్రజలు బయటికి రావాలంటే భయపడిపోతున్నారు. ఎవరైనా దగ్గినా, తుమ్మినా ఆమడ దూరం పరిగెడుతున్నారు. ఇలాంటి సమయంలో కూడా డెలివరీ బాయ్స్ ధైర్యంగా ఆహారం, ఇతర సామాగ్రిని డెలివరీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ పుట్టిల్లు ఉహాన్ లో ఓ స్ఫూర్తిదాయక సంఘటన జరిగింది.
ఓ డెలివరీ బాయ్ ఎప్పటిలాగే ఏప్రిల్ 15న తనకు వచ్చిన ఆర్డర్లను చూసుకుని వాటిని డెలివరీ చేస్తున్నాడు. పనిలో భాగంగా రాత్రి వచ్చిన కేక్ ఆర్డర్ తీసుకునేందుకు బేకరీకి వెళ్ళాడు. ఆ షాపులో పనిచేసే వ్యక్తి పార్సిల్ అందిస్తూ..‘ఇది నీకోసమే..’ అని తెలిపాడు. దీంతో అయోమయానికి లోనైన ఆ డెలివరీ బాయ్ 'పొరపాటుపడుతున్నారు, ఒకసారి చెక్ చేసుకోండి' అని షాప్ అతడికి చెప్పాడు. అతను మళ్లీ 'ఇది నీకోసమే' అని మళ్ళీ మళ్ళీ చెప్పాడు. కొంచెం సేపు ఆలోచించగా డెలివరీ బాయ్‌కు ఆరోజు తన పుట్టిన రోజని గుర్తుకు వచ్చింది. దీంతో ఆ డెలివరీ బాయ్ భావోద్వేగానికి లోనయ్యాడు. కన్నీళ్లను ఆపుకుంటూ కేక్ తీసుకుని బేకరీ బయట కూర్చున్నాడు. సంతోషంగా ఆ కేక్‌ను తిన్నాడు. ఈ సంఘటన అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.