'మేజర్' సినిమా వచ్చేసింది..నేటి నుంచే స్ట్రీమింగ్ - MicTv.in - Telugu News
mictv telugu

‘మేజర్’ సినిమా వచ్చేసింది..నేటి నుంచే స్ట్రీమింగ్

July 3, 2022

రెండు తెలుగు రాష్ట్రాల సినీ ప్రియులకు ‘మేజర్’ సినిమా చిత్రబృందం శుభవార్తను చెప్పింది. జూన్ 3వ తేదీన దేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై, మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ‘మేజర్‌’ సినిమాను నేడు ఓటీటీలో రిలీజ్ చేశామని, ఓటీటీ వేదికలైనా ‘నెట్ ఫ్లిక్స్’, ‘ఐ బొమ్మ’లో ఆదివారం నుంచి స్ట్రీమ్ అవుతోందని, సినిమాను ప్రతి ఒక్కరూ వీక్షించాలని చిత్రబృందం కోరింది.

ఇక, ‘మేజర్’ సినిమా విషయానికొస్తే.. ముంబై దాడుల్లో ఉగ్రవాదులతో వీరోచిత పోరాటం చేసి దేశం కోసం ప్రాణాలు అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్ శశి కిరణ్ తిక్క. యువ హీరో అడివి శేష్ హీరోగా, బాలీవుడ్ యువ నటి సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా శోభిత ధూళిపాళ్ల, ప్రకాష్ రాజ్, రేవతి ఇతర కీలక పాత్రలలో నటించారు. సోనీ పిక్చర్స్, ఏ ప్లస్ ఎస్ స్టూడియోస్‌తో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ సినిమాను నిర్మించాడు. జూన్ 3న తెలుగు, హిందీతోపాటు అన్ని భాషల్లో విడుదలై, మంచి విజయం సాధించింది. ఈ సినిమాతో అడివి శేష్ ప్యాన్ ఇండియా నటుడుగా పేరుగాంచారు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.