మూలుగుబొక్క 5 వచ్చేసింది.. బుడ్డపోరడు మీకు బాగా నచ్చుతాడు - MicTv.in - Telugu News
mictv telugu

మూలుగుబొక్క 5 వచ్చేసింది.. బుడ్డపోరడు మీకు బాగా నచ్చుతాడు

January 13, 2020

Mulugu Bokka 5.

మీరు ఎంతగానో ఆదరిస్తున్న మైక్ టీవీ ‘మూలుగుబొక్క’ 5వ భాగం వచ్చేసింది. ‘బుడ్డపోరడు‘ పేరుతో వచ్చింది. ఈ భాగంలో ఓ చిన్నారి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. మూలుగుబొక్కకు ప్రత్యేక అభిమానులు ఉన్నారు. మీరు 5వ భాగం ఎప్పుడు వస్తుందా అని అడిగారు. ఈసారి కాస్త ఆలస్యం అయినా వచ్చాం. సహజంగా పెళ్లి అయిన జంటకు పిల్లల గురించి దిగులు ఉంటుంది. ఈ విషయంలో లోకులకు మరింత ఎక్కువ శ్రద్ధ ఉంటుంది. పెళ్లి కానప్పుడు ఇంకా కాలేదా? ఎప్పుడు చేసుకుంటారు? అని అడుగుతారు. పెళ్లి అయ్యాక పిల్లలు కాలేరా? అని వేధిస్తారు. ఇది సహజంగా ప్రతీ ఒక్కరు ఎదుర్కునే సమస్యే. పిల్లలు అయ్యాక కూడా ఇంకా ఏదో కారణం చేత అవమానించే లోకులు ఉన్నారు. అలాంటి రోజూవారి సమస్యను ఇతివృత్తంగా తీసుకుని ఈ బుడ్డపోరడుని రూపొందించాం. 

పిల్లలు కలగడంలేదని సంఘీర్‌కు వాళ్లమ్మ ఫోన్ చేస్తుంది. డాక్టర్ దగ్గర టెస్టులు చేయించుకోవాలని కోరుతుంది. అది విని అతను విసుగుచెందుతాడు. రాధిక కూడా దిగులుచెందుతుంది. ఇద్దరం కలిసి ఆస్పత్రికి పోదాం అంటుంది. అందుకు భర్త వద్దంటాడు. లేదూ పోదాం అని పోరుతుంది ఆమె. ఈ మధ్యలో వారిమధ్యకు పక్కింటి మంజుల తన కొడుకుని తీసుకువచ్చి వీరికి ఇచ్చి వెళుతుంది. ఆ చిన్నారితో ఇద్దరూ కలిసి ప్రపంచం మరిచిపోయి ఆడుకుంటారు.. మైమరిచిపోతారు. ఎప్పటిలానే చక్కటి ఫీల్ కలిగించడానికి వచ్చిన ఈ మూలుగుబొక్క 5వ భాగాన్ని చూడండి. వీరాస్వామి కర్రె దర్శకత్వం వహించారు.