ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్, బీజేపీల కొత్త రికార్డు - MicTv.in - Telugu News
mictv telugu

ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్, బీజేపీల కొత్త రికార్డు

April 1, 2022

02

ఈశాన్య భారత రాష్ట్రాల్లో తాజాగా 4 రాజ్యసభ సీట్లకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ మూడింటిని కైవసం చేసుకోగా, మరొకటి ఎన్టీఏ భాగస్వామ్య పక్షం గెలుచుకుంది. మొత్తం ఈశాన్య రాష్ట్రాల్లో 14 రాజ్యసభ సీట్లుండగా, వాటిలో 13 ఎన్టీఏ, ఒకటి స్వతంత్ర అభ్యర్థి చేతిలో ఉన్నాయి. దీంతో చరిత్రలో తొలిసారి కాంగ్రెస్ పార్టీకి ఈశాన్య రాష్ట్రాల్లో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అలాగే ఇన్ని స్థానాలు బీజేపీకి దక్కడం కూడా ఇదే మొదటి సారి. ఈ రకంగా రెండు పార్టీలు ఒకేసారి వేర్వేరుగా చరిత్ర సృష్టించినట్టయింది. అంతేకాక, సీపీఎం పార్టీకి కూడా చాలా సంవత్సరాల తర్వాత తన సీటును కోల్పోయింది. అస్సాంలో జరిగిన ఎన్నికల్లో ఒక సీటును బీజేపీ ఈజీగా గెలుచుకోగా, మరొక సీటును కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడడం వల్ల గెలుచుకుంది. దీంతో పార్టీ నిబంధనలను ఉల్లంఘించిన సభ్యులను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. అసోం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండడంతో, ఆ పరిచయాలను ఉపయోగించుకొని రెండు సీట్లను ఎన్డీఏ ఖాతాలోకి వేయడంలో సక్సెస్ అయ్యారు.