‘కొడాలి నాని అనే నాకు నాలుగు కొమ్ములేం లేవు’ - MicTv.in - Telugu News
mictv telugu

‘కొడాలి నాని అనే నాకు నాలుగు కొమ్ములేం లేవు’

April 7, 2022

nani

మంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. తనకు నాలుగు కొమ్ములేం లేవనీ, అందరిలాగే మంత్రి పదవికి రాజీనామా చేశానని వెల్లడించారు. కొత్త మంత్రివర్గం ఈ నెల 11న ఏర్పాటవుతుందని తెలిపారు. అందులో ఇప్పుడు రాజీనామా చేసిన కొందరు మంత్రులకు అవకాశం ఉంటుందని చెప్పారు. అయితే తనకు మాత్రం అవకాశాలు తక్కువగానే ఉన్నాయని వివరించారు. తాము రాజీనామా చేస్తుంటే జగనే ఎక్కువ బాధపడ్డారని వ్యాఖ్యానించారు. కాగా, రాజీనామా ఇచ్చిన అనంతరం మంత్రులు తమకు ప్రభుత్వం ఇచ్చిన కాన్వాయిలను వదిలేశారు. కేబినెట్ భేటీ అనంతరం బయటికి వచ్చిన మాజీ మంత్రులు, తమ సొంత వాహనాల్లోనే ఇళ్లకు వెళ్లారు. అంతకుముందే తమ తమ ఛాంబర్లను కూడా ఖాళీ చేశారు. ఈ మేరకు ఏపీ సచివాలయంలో ఈ సన్నివేశం కనిపించింది.